మేడారంకు హెలికాప్టర్లు.. ఎంత చెల్లించాలంటే?

praveen
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం జాతర ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే ఇక మేడారం జాతర కు వెళ్లి సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అందరూ సిద్ధమైపోయారు. ఇక ప్రతి ఏడాది మేడారం జాతరకు కేవలం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు. ఇక ఇసుక వేసిన రాలనంత జనం మేడారం జాతరలో కనిపిస్తూ ఉంటారు. అందుకే మేడారం జాతర వచ్చిందంటే చాలు అటు ఆర్టీసీ అందరికీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతుంది.

 అయితే ఇటీవల కాలంలో కరోనా వైరస్ టైం లో ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడానికి కాస్త భయపడిపోతున్నారు.  ప్రత్యేకమైన వాహనాల్లోనే మేడారం జాతరకు వెళుతున్నారూ. అయితే ఇలా ఆర్.టి.సి బస్సులో అందరితో కలిసి కాకుండా కాస్త ప్రైవేట్ గా వెళ్ళాలి అనుకునే వారి కోసం ఇటీవలే ఒక బంపర్ ఆఫర్ రెడీ అయింది.  ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు కాదు ఏకంగా హెలికాప్టర్లో మేడారం జాతరకు వెళ్లేందుకు అవకాశం వచ్చింది. అదేంటి బాసూ హెలికాప్టర్లో వెళ్లడం ఏంటి అలాంటి ఆఫర్ కూడా పెట్టారా అని ఆశ్చర్య పోతున్నారు కదా.

 నిజంగానే ఇక మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులను  అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ హనుమకొండ తదితర నగరాల నుంచి ఇక భక్తులు మేడారం వెళ్లేందుకు ఈ హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇలా హెలికాప్టర్ లో వెళ్లాలి అనుకునేవారు 09880505905 నెంబర్ కు ఫోన్ చేసి హెలికాప్టర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎవరూ చెప్పడం కాదు మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఇక ఒక్కో వ్యక్తి హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు 19999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కరీంనగర్ నుంచి మేడారం 75000, హైదరాబాద్ నుంచి మేడారం 75000,  మహబూబ్నగర్ నుంచి మేడారం లక్ష రూపాయలు చార్జీ చేయనున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: