సర్వం సిద్ధం..బైలెళ్లుదామా మేడారం..!

MOHAN BABU
 కల్మషం లేని అడవిబిడ్డల జాతర, అంతు చిక్కని రహస్యాలకు పుట్టినిల్లు ఈ మేడారం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసులు జాతరగా పేరు పేరుపొందిన  మహా మేడారం జాతర పోదాం పదండి.. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం  ఇప్పటికే ప్రజల సౌకర్యార్థం  అన్ని పనులు పూర్తిచేసి జాతర కు సిద్ధం చేశారు. కరోణ వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్కార్ ఈ జాతరను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంది. ఈ మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఇప్పటికే తెలంగాణ మంత్రులు తెలియజేశారు. దీనికి తగిన విధంగానే సర్కార్ ఏర్పాట్లు

 కూడా చేసింది. ఈ ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మరియు డి ఐ జి మహేందర్ రెడ్డిలు అక్కడికి వెళ్లి పరిశీలన చేశారు. వైరస్ నేపథ్యంలో జంపన్న వాగు, మరియు సమ్మక్క-సారలమ్మ గద్దెల  దగ్గర ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి  మార్చి 19వ తేదీ వరకు ఈ యొక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతరను తిలకించేందుకు దేశం నలుమూలల నుండి దాదాపు నాలుగు కోట్లకు పైగా భక్తులు వస్తారని సర్కారు భావిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే జాతరకు భారీ పోలీస్  బందోబస్తు ఏర్పాటు చేశారు.

 దురదృష్టవశాత్తు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని, గంభీరావుపేట మండలానికి చెందిన  బి రమేష్ అనే హెడ్ కానిస్టేబుల్ మేడారం జాతరకు బందోబస్తు కోసం వచ్చాడు. ఆయన సమ్మక్క సారక్క ఆలయ బయట గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: