వైసీపీ లాలూచీతోనే ఆ మార్పు జరిగిందా..?

Chakravarthi Kalyan
ప్రత్యేక హోదా అంశాన్ని త్రిసభ్య కమిటీ చర్చల ఎజెండా నుంచి తొలగించడానికి వైసీపీ లాలూచీ వైఖరే కారణమంటోంది టీడీపీ.. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంతో వైసీపీ లాలూచి పడటం వల్లే ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చర్చల ఎజెండా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే  ఈనెల 17న  తేదీన జగనున్న సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ నాయకులు పక్క తోవ పట్టిస్తున్నారని.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే బిజెపికి కావాలిన మెజారిటీ వచ్చిందని చేతులెత్తేశారని రవీంద్ర కుమార్ గుర్తు చేశారు. మన అవసరం వాళ్లకి లేదని అధికారంలోకి వచ్చిన రెండవ రోజే ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పడేసిన వ్యక్తి జగన్ అని రవీంద్ర కుమార్‌ విమర్శించారు.

అంతే కాదు.. ప్రజలకు తప్పుతోవ పట్టించడానికి ప్రత్యేక హోదా విషయం అడుగుతూనే ఉంటామని అంటున్నారు తప్ప... ఏనాడూ చిత్త శుద్దితో వైసీపీ పోరాటం చేయలేదని.. వైసిపి ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా ప్రత్యేక హాదా విషంయంలో ఓకే ప్రశ్న తూతూ మంత్రంగా వేశారని టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం సూటిగానే సమాధానం చెప్పినా విపక్షాల ధాటికి తట్టుకోలేక వైసీపీ నేతలు ముసుగులో మాట్లాడుతూ ప్రజలను ఇంకా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ రవీంద్ర కుమార్ విమర్శించారు.

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కాలయాపన చేయకుండా కేంద్రంపై పోరాటానికి ముందుకు వస్తే.. టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని కనకమేడల రవీంద్ర కుమార్‌ అంటున్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే.. జనవరి 3న ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో ఆ అంశాన్ని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని.. పూర్తిగా కేంద్రానికి లొంగిపోయిందని టీడీపీ ఎంపీ విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: