జీవీఎల్ కొత్త స్కెచ్..?

M N Amaleswara rao
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల ఏపీ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది...అసలు పెద్దగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడని జీవీఎల్..ఈ మధ్య ఏపీకి సంబంధించిన అంశాలపై రాజ్యసభలో ఎక్కువ ప్రశ్నిస్తున్నారు. మామూలుగా జీవీఎల్‌ ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తే..కానీ ఆయన ఏపీలో ఉండరు...ఢిల్లీలోనే ఎక్కువ ఉంటారు. అయితే ఇంతవరకు రాజ్యసభ సభ్యుడుగా ఉండి...ఏపీకి చేసింది కూడా ఏమి లేదు.
వాస్తవానికి జీవీఎల్ అంటే ఏపీ ప్రజలకు పెద్దగా తెలియదు...కాకపోతే టీడీపీ ప్రభుత్వంలో ఈయన బాగా హైలైట్ అయ్యారు. ఎప్పుడైతే టీడీపీ, బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చిందో అప్పటినుంచి జీవీఎల్ పేరు కాస్త ఎక్కువ వినబడింది...ఇక జీవీఎల్ పని అప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం, టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే అన్నట్లు ఉండేది. కానీ తెలుగు నేత అయి ఉండి ఎప్పుడు కూడా ఏపీకి ఉపయోగకరమైన పని ఏమి చేయలేదు.
అందుకే జీవీఎల్ అంటే కాస్త టీడీపీ శ్రేణులకు కోపం ఉండేది...ఇక టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక జీవీఎల్ కాస్త ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ ఇటీవల ఎక్కువ కనిపిస్తున్నారు...పైగా ఏపీ ప్రయోజనాల కోసం రాజ్యసభలో మాట్లాడుతున్నారు. ఆ మధ్య ఏపీ రాజధాని ఏది అంటూ రాజ్యసభలో ప్రశ్న వేయగా, కేంద్రం అమరావతి అని సమాధానం ఇచ్చింది. అంటే అమరావతి రాజధానిగా ఉందని జీవీఎల్ చెప్పాలని చూసినట్లు ఉన్నారు. దాని ద్వారా బీజేపీ అమరావతికి మద్ధతుగానే ఉందని విషయాన్ని రుజువు చేయాలని చూసినట్లు ఉన్నారు.
ఇక తాజాగా కాపుల రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో మాట్లాడారు...ఏపీ జనాభాలో ఎక్కువగా ఉన్న కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, కాబట్టి కాపులని ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపింది...అప్పుడు జీవీఎల్ పెద్దగా స్పందించలేదు..కానీ ఇప్పుడు స్పందిస్తున్నారు..అంటే ఏపీలో కాపుల మద్ధతు కమలం పార్టీకి చేయాలని చూస్తున్నారు..కానీ ఎన్ని చేసిన జీవీఎల్ ప్లాన్స్ వర్కౌట్ కావనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: