మన శంకర వరప్రసాద్ గారు: థియేటర్లలో విజిల్స్ వేస్తున్న ఫ్యాన్స్..!
స్టోరీ విషయానికి వస్తే:
శంకర్ వరప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుంటారు. కేంద్ర హోంమంత్రి వద్ద తన టీమ్ తో కలిసి పని చేస్తూ ఉన్న వరప్రసాద్ బాగా డబ్బున్న అమ్మాయి శశిరేఖ (నయనతార) ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. కానీ శశిరేఖ తండ్రి (సచిన్ ఖేద్కర్) వీరిద్దరి మధ్య గొడవలు తెచ్చి విడిపోయేలా చేస్తారు. వరప్రసాద్ ఇద్దరి పిల్లల్ని కూడా దూరం చేస్తారు. ఆ తర్వాత కొన్నేళ్ళకి తన పిల్లలు ఇద్దరు కూడా ఇంటికి దూరంగా స్కూల్లో చదువుతున్నారని తెలిసి అక్కడ పిటి సర్ గా జాయిన్ అవుతారు వరప్రసాద్. వరప్రసాద్ మంచివాడు కాదని శశిరేఖ తన పిల్లలకు చెబుతూ పెంచుతుంది. దీంతో అసలు తండ్రి ఎవరో తెలియకుండా తన పిల్లలను పెంచుతుంది శశిరేఖ. మరి పిల్లల కోసం వరప్రసాద్ ఏం చేస్తారు? ఎలా దగ్గరయ్యారు? శశిరేఖ జీవితంలోకి ఎలా మళ్లీ వెళ్తారు? వెంకటేష్ గౌడ (వెంకటేష్) పాత్ర ఏంటి అన్నది తెరపై చూడాలి.
ఫ్యాన్స్ విజిల్స్:
వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా సంక్రాంతి పండక్కి వచ్చి హిట్టు కొట్టారు. చిరంజీవి, నయనతార ఎవరి పాత్రలో వారు అద్భుతంగా నటించారు. చిరంజీవి సినిమా వెంకటేష్ గెస్ట్ రోల్ లాంటి వాటితోనే సినిమా పైన అంచనాలను పెంచేశారు. అలాగే చిరంజీవి హుక్ స్టెప్ సాంగ్ తో కూడా మరింత అంచనాలను పెంచేసి సోషల్ మీడియాని షేక్ అయ్యేలా చేశారు. సినిమా ఫస్టఫ్ అంతా కూడా వరప్రసాద్ ఎంట్రీ ,అతని ఉద్యోగం, శశిరేఖ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, విడిపోవడం వంటి వాటితోనే సాగుతుంది. సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా నవ్వుతూ ఎంజాయ్ చేయిస్తారు. ఇక ఇంటర్వెల్ ముందు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ జరుగుతుంది. ఇక సెకండాఫ్లో కామెడీ తో పాటుగా ఎమోషనల్ యాక్షన్ సీన్స్ తో పాటు వెంకటేష్ సీన్స్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. వెంకటేష్ కామెడీ సీన్స్ కూడా మరింత ఆకట్టుకుంటాయి. చిరంజీవి బరువు తగ్గి కొత్త లుక్ లో కూడా సరికొత్తగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఎమోషన్స్, విలువలు ఈ మధ్యకాలంలో భర్తల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక సూపర్ మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ ఎంట్రీ తో సినిమా మరింత హైప్ పెరిగిపోయింది. చిరంజీవి, వెంకటేష్ కలిసి డాన్స్ వేసే సీన్ థియేటర్లలో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేస్తున్నాయి. చిరంజీవి చెప్పే కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. మామ పాత్రలో (సచిన్ ఖేద్కర్) అద్భుతంగా నటించారు. అలాగే కేథరిన్ ,అభినవ్ గోమటం,హర్ష గోవర్ధన్ తమ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ నటనతోనే ఆకట్టుకున్నారు.మొత్తానికి మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి అందరిని నవ్వించి మళ్లీ హిట్ కొట్టేసారని చెప్పవచ్చు. అయితే కొన్నిచోట్ల రొటీన్ స్టోరీ, సాగదీత సీన్లు ఉన్నాయంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో డాన్స్ స్టైల్ తో వింటేజ్ మెగాస్టార్ గా అదరగొట్టేశారు. మరి మొదటి రోజు ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి చిరంజీవి.