మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్..జననాయగన్ రీమిక్స్ పై డైరెక్టర్ అనిల్ కామెంట్స్..!

Divya
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో జనవరి 12న విడుదలైన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరి రీమేక్స్ పైన ప్రశ్నించగా అనిల్ చాలా హుందాగానే సమాధానాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.



భగవత్ కేసరి సినిమా ఆత్మను తీసుకొని అక్కడ నెగెటివిటీకి అనుగుణంగానే మార్పులు చేసి ఉంటారని అందుకే విజయ్ జననాయగన్ సినిమా ట్రైలర్లో ఓపెనింగ్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ ఇలా కొన్ని సీన్స్ మాత్రమే యధావిధిగా ఉండవచ్చు, కానీ మిగిలినదంతా  మార్చి ఉంటారని తెలియజేశారు. ట్రైలర్లో చూస్తే విలన్ ట్రాక్ మొత్తం మారిపోయినట్లుగా కనిపిస్తోంది. అలాగే రోబోట్స్ కూడా అందులో కనిపిస్తున్నాయి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకి జోడించి ఉండవచ్చు అంటూ తెలిపారు. అలాగే భగవంత్ కేసరి సినిమా హీరో విజయ్ సార్ కి బాగా సెట్ అవుతుందని ఆయనకు కూడా సినిమా బాగా నచ్చిందని ఎవరేమనుకున్నా ఎవరు ఎంత అనుకున్నా కూడా ఈ సినిమాకి విజయ్ నటన మరింత బలం అవుతుందని తెలిపారు. సినిమా రీమేక్ అనుకున్నప్పుడు ఎవరు ఎలా తీసినా కూడా అది అలాగే తీయాలి గతంలో కూడా ఎన్నో రీమిక్స్ సినిమాలు అలా తీసినవే అంటూ తెలిపారు.


అయితే కరోనా వచ్చిన తర్వాత రీమిక్స్ సినిమాలు తగ్గిపోయాయని, వాస్తవంగా రీమిక్స్ సినిమా అంటే ఒక భాషలో తీసిన సినిమాని మరొక భాషలో తీయడమే కదా! ఒకవేళ వాళ్ళు రీమిక్స్ సినిమా అని చెప్పకపోవడానికి కారణాలు చాలానే ఉండవచ్చని, తమిళ ప్రేక్షకులు భగవంత్ కేసరి సినిమా చూడలేదు! వారికి ఇది ఒక కొత్త సబ్జెక్ట్. గతంలో కూడా హిందీలో దబాంగ్ సినిమాని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో మార్చి తీశారు మంచి విజయాన్ని అందుకుంది. ఒక కథకు అక్కడి హీరో బలాలు యాడ్ అయితే ఆ సినిమా మరొక లాగా ఉంటుందని తెలిపారు. ఇంకా జననాయగన్ సినిమా చూడలేదు ఆయన ఏం చేశారో చూసాకే మాట్లాడుకోవాలి. కేవలం ట్రైలర్లో కొన్ని సీన్స్ చూసి మాట్లాడడం అనవసరం. పూర్తి కంటెంట్ బయటికి వచ్చిన తర్వాతే మనం మాట్లాడాలి ఇది విజయ్ గారికి మంచి వీడ్కోలు అవుతుందని భావిస్తున్నానని తెలిపారు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: