గోవులకు అక్కడ ఏం వేస్తున్నారో తెలుసా

సాధు స్వభావానికి మారుపేరు గోవు. అందుకే మంచి మెతక మనిషిని గోవు స్వభావం కలిగిన వాడుగా వ్యవహరిస్తారు. అలాంటి గోవుల ఆలనాపాలనా లేక వీధుల్లోనే తిరగాడుతూ బతికేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి గోవుల కోసమే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ధర్మశాల సమీపాన ఓ జంతు సంక్షేమ సంస్థ వారు గో సంరక్షణ శాల ను నడుపుతున్నారు. 




అందులో భాగంగా వారు దిక్కుమొక్కులేని గోవుల పట్ల క్రూరంగా ప్రవర్తించే ప్రజల్లో మార్పు తెచ్చే ప్రయత్నాన్నీ చేస్తున్నారు. మాట వినకుండా మొండికేసిన సందర్భాల్లో అవి ఎందుకలా ప్రవర్తిస్తున్నాయో తెలుసుకోకుండా ప్రజలు చేతికొచ్చిన వాటిని తీసుకొని  వాటిని దారుణంగా హింసిస్తుంటారు. ఈ కారణంగా చాలా సార్లు అవి తీవ్రంగా గాయపడుతుంటాయి. ఆ క్రమంలో వాటి కొమ్ములు విరిగిపోతాయి, ఫ్రాక్చర్ లు అవుతాయి. 



అలాంటి గోవులకు ఇక్కడ వీరు ఆసరా కల్పించడమే కాకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతాంగం వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా వారికి అవగాహన కలిగిస్తారు. అంతేకాదు, తీవ్ర చలిగాలులకు అవి బాధ పడకుండా వాటికి స్వేట్టర్లు తయారు చేస్తున్నారు. 



స్వేట్టర్లు తయారు చేయడం ఎలాగంటే గోనె సంచుల్ని గోవులకు ధరింపజేసేలా మారుస్తున్నారు. ఆ స్వేట్టర్లు పై కృష్ణుడి బొమ్మను పెయింట్ చేసి ఈ గోవు దేవుడి ది అని వాటి రాస్తున్నారు. దీనివల్ల జనంలో గోవు పట్ల పూజ్య , కారుణ్య భావాలు పెంపొందుతాయని వారి భావన. స్వేట్టర్లు మీద కృష్ణ పరమాత్మ బొమ్మ వేయడం వల్ల ప్రజలు ఆ గోవుల మీద దాడులు చేయరు అని నిర్వాహకులు చెబుతున్నారు.
 



గోవులు మనషుల్లాంటివే , వాటికీ బాధ , నొప్పి ఉంటాయి. అన్ని మతాలు దయతో ఉండమనే బోధిస్తాయి కనుక ప్రతివారు ఈ విషయమై ఆలోచించాలి. మార్పు అంత త్వరగా రాదు కానీ ఏంతో కొంత మార్పు తథ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: