అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Veldandi Saikiran
అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
అనంతపురంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతులు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప (60) బంధువులు చక్రం తిప్పి అక్కడికక్కడే మృతి చెందారు.వివరాల్లోకి వెళితే మండలంలోని నిమ్మగల్లు గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కోకా వెంకటప్ప నాయుడు(58)కి ప్రశాంతి ఒక్కగానొక్క కూతురు. ఒక్కడే సంతానం కావడంతో ఆమెను ఎంతో ఆప్యాయంగా పెంచాడు. కాగా, ఆదివారం ఉదయం బళ్లారిలోని అల్లంభవన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రశాంతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం వెంకటప్ప నాయుడుతో పాటు ఆయన సమీప బంధువులు ఎనిమిది మంది కలిసి ఇన్నోవా వాహనంలో నిమ్మగల్లుకు బయలుదేరారు. 

వీరి వాహనం బూదగావి నుంచి వస్తుండగా అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న 16 చక్రాల ఐరన్ ఓర్ లారీ ఎదురుగా ఢీకొంది. ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ సీటులో ఉన్న వెంకటప్ప నాయుడుకు తీవ్రగాయాలు కావడంతో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా నిమిషాల వ్యవధిలోనే మృతి చెందాడు. మిగిలిన ఎనిమిది మంది తీవ్ర గాయాలతో వాహనంలోనే చనిపోయారు. మృత దే హాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయంత్రం వరకు ఆనందంగా ఉన్న వారిని చూసి బంధువులు శోక సంద్రం లో మునిగి పోయారు. ఘటన పై ఉరవ కొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా క లెక్టర్ నాగలక్ష్మి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయారు మరియు మృతుల బంధువులకు ఒక్కొక్కరికి ₹2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: