నివాళి స్వ‌రం : ల‌తాజీ గురించి కేసీఆర్ ఏమ‌న్నారంటే?

RATNA KISHORE
ఎనిమిది ద‌శాబ్దాల కాలం ఒక పాట‌లో కొలువు అయి ఉంటుంది. ఎన్నో స్వ‌ర సంగ‌మ క్షేత్రాలు హృద‌యంలో నిలిచి ఉంటాయి.
కేసీఆర్ అన్న విధంగా ఆమె పాడుతూ పాడుతూ స‌ప్త స‌ర్వ సంగీత మాధుర్యాన్ని ఇచ్చి వెళ్లారు.వ‌రంగా ఇచ్చి వెళ్లారు. గ‌జ‌ల్ పాట‌ల్లో ఉన్న గొప్ప‌దనాన్ని చాటి వెళ్లారు. చాటింపు వేసి వెళ్లారు. స్వ‌ర ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌తిసారీ ఉర్దూ భాష సాహిత్య సంబంధ ఔన్న‌త్యం ఒక‌టి  చాటారు. అదే రీతిన భార‌తీయ భాష‌ల‌కు వాటి గౌర‌వానికీ మ‌రో మంచి విలువ‌ను ఆపాదించారు.శ‌బ్ద ల‌య సంబంధ పాట‌లు, అర్థ గ‌తుల‌ను ఆపాదించుకున్న పాట‌లు ఎన్నో విన్యాసాలు స్వ‌ర విన్యాసాలు అని రాయాలి.. ఎన్నో స్వ‌ర విన్యాసాలు వినిపించి, శ్రోత‌ల‌ను నాటి ఆకాశ‌వాణి శ్రోత‌ల‌ను నాటి దేశ పాల‌కుల‌ను ఇంకా ఎంద‌రినో కంట‌త‌డి పెట్టించారు.

ఆ గానం చెంత తెలంగాణ ప్ర‌జ‌లు ఆంధ్రా ప్ర‌జ‌లు ఇంకా చాలాప్రాంతాల ప్ర‌జ‌లు వాళ్ల క‌ష్టాలు అన్నీ అన్నీ మైమ‌ర‌పున‌కు గురి అయ్యాయి. ఆ పాట వాంగ్మ‌యం చెంత మ‌రో కొత్త లోక అన్వేష‌ణ ఆరంభం అయి ఉంటుంది. ఉంటుంది కాదు ఉంది కూడా!
ఆ విధంగా కేసీఆర్ ఆ గాన కోకిల‌ను ఆ స్వ‌ర స‌ర‌స్వతిని అర్చిస్తున్నారు.నివాళి ఇస్తూ ఆ పాట మాధుర్య ధోర‌ణులను వివ‌రిస్తున్నారు ఇవాళ.ఆయ‌న‌తోపాటు శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఇంకా ఇంకొంద‌రు ఆ గాన స‌రస్వ‌తికి జేజేలు ప‌లుకుతూ..ఆ స్వ‌ర రాగ గంగ‌కు నీరాజ‌నాలు ఇస్తున్నారు.ఒక స్మ‌ర‌ణ ఉద్వేగం ఒక స్మ‌ర‌ణ బాధ్య‌తాయుతం.. ఈ దేశం ఇవాళ ఆమెను స్మ‌రించ‌డం అంటే ఓ గొప్ప స్వ‌ర శిఖ‌రం చెంత విన‌మ్రంగా నిలిచి, విషాద కాలాల‌ను త‌ల‌చి క‌న్నీటి ప‌ర్యంతం అవ్వ‌డ‌మే..

ఇవాళ భార‌త‌ర‌త్న ల‌తామంగేష్క‌ర్ లోకం విడిచారు.ఎన్నో వేల‌పాట‌ల‌తో శ్రోతల‌ను అల‌రించిన ఆమె త‌న గొంతుక ఇక వినిపించ‌ద‌ని చెప్పి వెళ్లారు.ఓ విధంగా సెల‌వు అని చెప్పి వెళ్లారు. కానీ ఆమె ఎక్క‌డికి  వెళ్తారు.ఎందుక‌ని మ‌న‌కు దూరం అవుతారు.ఆమె గానం కార‌ణంగా ఇక్క‌డే ఉంటారు.అస‌మాన ప్ర‌తిభ కార‌ణంగా మ‌న బిడ్డ‌ల్లో బిడ్డ అయి ఉంటారు.మ‌న గాలుల్లో నిండి ఉంటారు. మ‌న జీవ‌నదుల్లో వినిపిస్తూ ఉంటారు.క‌నుక శ‌బ్ద ల‌య గ‌తుల్లో నిలిచిన పాట ఆమె. స్వ‌రాయువు ఆమె. ఇవాళ ఆమె మ‌ర‌ణం కేవ‌లం భౌతిక సంబంధం.భౌతిక సంబంధం అయిన‌వే విషాదాల‌ను మిగిల్చివెళ్తాయా? ఆమె ఎక్క‌డ ఉన్నా భార‌తీయ సంగీత ధోర‌ణుల్లో ఉంటారు. పాట‌కు ప్ర‌తిరూపం అయి ఉంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న విధంగా స‌రస్వ‌తికి మ‌రోరూపం అయి ఉంటారు. ఆ అమ్మ‌కు జేజేలు.
మ‌నం అయితే ఏడుస్తాం..నిబ్బ‌రం కోల్పోతాం..కానీ ల‌తాజీ చిన్న వ‌య‌స్సులోనే బాధ‌లు చూసి కుటుంబ బాధ్య‌త‌లు
అందుకున్నారు.స్వ‌ర శాస్త్ర అభ్యాసం చేశారు. బాగా పాడే కుటుంబం అది. అందుకే ఆమెకు కూడా నాన్న విద్య అబ్బింది.హృద‌య కోవెల‌ల చెంత ఆమె నిలిచి ఉన్నారు క‌నుక ఆమె చ‌నిపోరు. అలా రాయ‌కూడ‌దు.కొన్నివేల పాట‌లు పాడిన కార‌ణంగా ఆమె ప్ర‌తిభ‌ను లేదా సంబంధిత వ్యుత్ప‌త్తిని కొల‌వ‌లేం. పుర‌స్కారాలకు ఆమె కార‌ణంగా గౌర‌వం వ‌చ్చింద‌ని కేసీఆర్ అంటున్నారు. అవును! ఎన్నో పుర‌స్కారాలు ఆమెను వ‌రించి త‌మ ఉన్న‌తిని పెంచుకున్నాయి. త‌మ‌దైన కీర్తిని ద‌క్కించుకున్నాయి ఆమె ద్వారా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: