విశాఖలో సైకిల్ సీట్లు మారతాయా?

M N Amaleswara rao
రాజకీయాల్లో పరిస్తితులకు తగ్గట్టుగా ముందుకెళుతూ ఉండాలి...అప్పుడే రాజకీయంగా ఏ పార్టీ అయిన నిలబడగలుగుతుంది..అలా కాకుండా పరిస్తితులు అర్ధం చేసుకోకుండా ఎడాపెడా రాజకీయం చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం...తమకు అనుకూలమైన పరిస్తితులు తీసుకొచ్చి రాజకీయంగా ముందుకెళుతున్నారు. అలాగే అనుకూలమైన పరిస్తితులు రావడానికి కీలక మార్పులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అనేక మార్పులు చేశారు. అలాగే పలు నియోజకవర్గాల్లో నాయకులని మార్చారు.
అలా నాయకులని మార్చడం వల్లే టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వచ్చిందనే చెప్పాలి...లేదంటే పనిచేయని నాయకుల వల్ల పార్టీకి ఏ మాత్రం లాభం రాలేదు. అయితే ఇంకా పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది..పలు నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు తప్పనిసరి అయ్యేలా ఉంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలో కొన్ని సీట్లలో మార్పులు జరిగేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొందరు అభ్యర్ధులని మార్చేశారు.
అలాగే ఇంకా కొన్ని చోట్ల మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో మాడుగుల నియోజకవర్గంలో మార్పు చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని పక్కనబెట్టి, పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. అలాగే విశాఖ సౌత్‌లో గండి బాబ్జీని, భీమిలిలో కోరాడ రాజబాబుని ఇంచార్జ్‌గా పెట్టారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేసే అవకాశ్యకత కనిపిస్తోంది.
విశాఖ నార్త్‌లో నెక్స్ట్ మార్పు జరిగేలా ఉంది..మళ్ళీ ఈ సీటు గంటా శ్రీనివాసరావుకు ఇవ్వడం కష్టమే. అటు అరకు సీటుని కిడారి శ్రావణ్ కుమార్‌కు ఇచ్చేలా లేరు. అదేవిధంగా అనకాపల్లి సీటు విషయంలో కూడా మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. ఇక పొత్తు ఉంటే గాజువాక సీటు జనసేనకు ఇవ్వొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు...కాబట్టి పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే ఇవ్వొచ్చు. మొత్తానికైతే విశాఖపట్నంలో టీడీపీలో పలు సీట్లలో మార్పులు జరిగేలా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: