షాకింగ్ : కూలిన విమానం.. ఏడుగురు మృతి?

praveen
పెరులో ఎడారిలో ఉన్న పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎప్పుడు వివిధ దేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక అక్కడ ఉన్న ప్రాంతాలను చూసి ఎంతగానో ఆనంద పడిపోతూ వుంటారూ. అయితే ఇలా అనుకోవడమే ఇక్కడ కొంతమంది ప్రయాణికుల పాలిట మృత్యు శకటం గా మారిపోయింది. ఎడారిలో ఉన్న పర్యాటక స్థలాలు సందర్శించడానికి వెళుతున్న సమయంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. దీంతో విమాన ప్రమాదంలో ఏకంగా ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. అయితే  ఎడారి ప్రాంతానికి సందర్శించడానికి వెళ్తున్న విమానం  టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరగడం గమనార్హం.

 ఈ విషయాన్ని పెరు రవాణా కమ్యూనికేషన్  మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు పర్యాటకులు  ఇద్దరు పైలెట్లు  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం స్థానికులు అందరిని కూడా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది. ఇక ప్రమాదంలో చనిపోయిన పర్యాటకులలో ముగ్గురు డచ్ టూరిస్టులు ఉండగా ఇద్దరు చీలి కి చెందిన టూరిస్టులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అయితే ఇలా ప్రమాదానికి గురైన విమానం ఏరో శాంటోస్  అనే పర్యాటక సంస్థకు సంబంధించినదిగా గుర్తించారు అధికారులు.

 ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే పెరులో నాజ్కా లైన్లు ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన కొన్ని బొమ్మలు జీవులు మొక్కలు చిత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ కూడా విమానాల్లో వస్తూ ఉండడం గమనార్హం. దాదాపు డజన్లకొద్దీ విమానాలు ఈ పర్యాటక ప్రాంతంలో ప్రతిరోజు నడుస్తూ ఉంటాయ్. 2010 అక్టోబరులో కూడా అచ్చంగా ఇలాంటి విమాన ప్రమాదం జరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: