కరీంనగర్‌ లో రోడ్డు ప్రమాదంపై బండి సంజయ్ కీలక ప్రకటన ?

Veldandi Saikiran
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు విడుదల చేసిన ప్రకటన  చేశారు.  కరీంనగర్లో నలుగురు వీధి వ్యాపార మహిళల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ వో, ఆసుపత్రి సూపరిండెంట్ లతో  మాట్లాడిన ఎంపీ బండి సంజయ్...క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.  కరీంనగర్‌ పట్టణంలో కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన నివాసముండే నలుగురు  మహిళలను బలితీసుకున్న దుర్ఘటనపై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


కమాన్ ప్రాంతం లో వీధి వ్యాపారం చేసుకుంటూ అక్కడే  తాత్కాలిక   గుడిసెల్లో నివాసం ఉంటున్న ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలు కారు ప్రమాదంలో  మృత్యు వాత పడడం  విచారకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే గుడిసెల్లో   నివాసం ఉండి వృత్తిని కొనసాగించే వీరిని కారు ప్రమాదం  బలి కొనడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను ఎంపీ బండి సంజయ్ కుమార్ అధికారులతో ఫోన్లో   మాట్లాడి తెలుసుకొని, దుర్ఘటన పై వివరాలు ఆరా తీశారు. జిల్లా వైద్య అధికారులతో ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫో న్లో మాట్లాడి  ప్రమాదంలో గాయపడిన మిగతా  క్షత గాత్రులకు, బాధితులకు  మెరుగైన వైద్య సదుపాయం అందించడానికి తక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అలాగే స్థానిక బీజేపీ శ్రే ణులు ప్రమాద స్థలానికి తరలి వెళ్లి,  గాయపడిన క్షత గాత్రులకు , బాధిత కుటుంబానికి అండగా నిలిచి తగిన సహాయ సహకారాలు చేపట్టాలని ఎంపీ బండి సం జయ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: