రేవంత్‌కు సీనియర్లు డబుల్ చెక్..?

M N Amaleswara rao
తెలంగాణలో రేవంత్ రెడ్డికి సీనియర్ నేతలతో ఇబ్బంది తగ్గేలా కనిపించడం లేదు..అసలు సీనియర్లు రేవంత్‌కు సహకరించేలా లేరు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి తెలంగాణలో పలువురు సీనియర్లు....రేవంత్‌కు వ్యతిరేకంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే..చాలామంది రేవంత్‌పైనే బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. దీని వల్ల కాంగ్రెస్‌ల గందరగోళ పరిస్తితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతుంటే...కాంగ్రెస్‌లో మాత్రం నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసే విషయం పక్కనబెడితే....ముందు డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలు అనే పరిస్తితి ఉంది.
అయితే సీనియర్లకు రేవంత్ ఎలాగోలా చెక్ పెట్టడానికి చూస్తున్నారు గాని...అది పూర్తిగా సాధ్యపడటం లేదు..ఎందుకంటే సీనియర్లకు కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి...దీంతో వారికి చెక్ పెట్టడం రేవంత్ వల్ల కావడం లేదు. పైగా చాలామంది సీనియర్లు రెండేసి సీట్లు తీసుకోవాలని చూస్తున్నారు...ఇక అలాంటి వారిని కూడా ఆపాలని రేవంత్ చూసినట్లు సమాచారం. కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు.
ఇప్పటికే పలువురు సీనియర్ నేత ఫ్యామిలీలకు రెండేసి సీట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో...ఎలాగో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రెండు సీట్లు ఫిక్స్...వారిని రేవంత్ ఆపలేరు. వెంకటరెడ్డికి నల్గొండ, రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీట్లు ఉన్నాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి కోదాడ, హుజూర్‌నగర్ సీట్లు ఫిక్స్.


అటు జానారెడ్డి ఫ్యామిలీకి నాగార్జున సాగర్, మిర్యాలగూడ సీట్లు దక్కుతాయని తెలుస్తోంది. ఇటు వరంగల్‌లో కొండా సురేఖ ఫ్యామిలీకి వరంగల్ ఈస్ట్, పరకాల సీట్లు ఫిక్స్ అవుతాయని తెలుస్తోంది. భూపాలపల్లి కూడా అడుగుతున్నారు...కానీ రేవంత్..ఆ సీటు గండ్ర సత్యనారాయణకు ఫిక్స్ చేశారు. వీరే కాదు..ఇంకా కొందరు సీనియర్లు రెండేసి సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి వారికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెబుతుందో లేదో చూడాలి..ఇక ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోతున్నారని అర్ధమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: