బాబు..పల్లా పొజిషన్ ఏంటి?

M N Amaleswara rao
అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకులకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే నేతలకు మంచి పొజిషన్ వస్తుంది. అలాగే విశాఖలో పల్లా శ్రీనివాస్‌కు కూడా టీడీపీలో మంచి పొజిషన్ వచ్చింది. ఎప్పుడైతే వాసుపల్లి గణేశ్ టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు..అప్పుడే పల్లాకు టీడీపీలో మంచి పొజిషన్ దొరికింది. విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. ఇక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ..విశాఖలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పల్లా పనిచేస్తున్నారు.
రాజకీయంగా వైసీపీతో ఎన్ని ఇబ్బందులు ఎదురైన పల్లా లొంగకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా గట్టిగానే పోరాడుతున్నారు. ఇలా పార్టీ కోసం పల్లా నిత్యం పనిచేస్తూనే ఉన్నారు. ఈ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్న పల్లాకు ఒక చిన్న ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. అది ఏంటంటే...నెక్స్ట్ పల్లా పోటీ చేసే సీటు విషయంలో..అదేంటి పల్లాకు గాజువాక సీటు ఉందని అనుకోవచ్చు.
కానీ ఈ సీటు విషయంలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయి. వాస్తవానికి గాజువాక సీటు పల్లాదే. కాకపోతే నెక్స్ట్ టీడీపీ గాని జనసేనతో పొత్తు పెట్టుకుంటే..గాజువాక సీటు విషయంలో ట్విస్ట్ రావొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఓడిపోయారు...మళ్ళీ ఆయన అక్కడే పోటీ చేస్తే గాజువాక సీటు వదులుకోవాలి...ఆయన పోటీ చేయకుండా జనసేనకు సీటు కేటాయించాలని పట్టుబట్టిన ఏం చేయలేని పరిస్తితి.  లేదు దీని బదులు వేరే సీటు తీసుకుంటే పల్లాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ జనసేనతో పొత్తు ఉండి...గాజువాక సీటు కోరుకుంటే..పల్లాకు వేరే సీటు చూపించాలి. అయితే విశాఖలో దాదాపు అన్నీ సీట్లలో టీడీపీ నేతలు ఉన్నారు. మరి అలాంటప్పుడు పల్లా పొజిషన్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఒకవేళ పొత్తు లేకపోతే మాత్రం క్లారిటీ ఉంటుంది..ఉంటే మాత్రం పల్లా పొజిషన్ ఏంటి అనేది చంద్రబాబు డిసైడ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: