కృష్ణాలో ఈ సారి వైసీపీకి ఫుల్ డ్యామేజ్‌.. వీళ్లంతా అవుటే ?

VUYYURU SUBHASH
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం.. మ‌రో ప్రతిపక్ష పార్టీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేన తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే చాలా జిల్లాల్లో అధికార వైసిపికి ఇబ్బందులు తప్పవు. రాజధాని ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా - గుంటూరు జిల్లాల్లో అధికార వైసీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఈ విషయం చర్చకు వస్తోంది. కృష్ణా జిల్లాలో అసలే రాజధాని మార్పు ప్రభావంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతుంటే... అటు జిల్లాలో సగానికిపైగా ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.

రెండున్నర సంవత్సరాల్లోనే జిల్లాలో సీన్ మారిపోయిందని చెప్పాలి.  వైసీపీకి పైకి మాత్రమే అధికార బలం కనిపిస్తోంది... కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ పార్టీ వీక్ అవుతూ వస్తోంది. ఆ పార్టీ  రెండున్న‌ర  సంవత్సరాల్లోనే వీక్ అవటానికి పలువురు ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగా పోవడమే కారణం అని చెప్పాలి. చివరకు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు - పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై సొంత పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక గన్నవరం లో పార్టీ మారిన వల్లభనేని వంశీ కి వైసీపీ కీలక నేతల నుంచి నియోజకవర్గంలో సహాయనిరాకరణ ఎదురవుతోంది. పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో పాటు , అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ సైతం ఆయా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి సైతం ఇప్పుడు పెన‌మ‌లూరులో సొంత పార్టీ నేతల నుంచి స‌హ‌కారం లేదు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న ఆవేద‌న‌తో ఆయ‌న కేడ‌ర్‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదేమైనా ఈ సారి కృష్ణా జిల్లాలో అధికార వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరిగే పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: