ప్రధాని మోడీకి కేసీఆర్‌ ప్రేమ లేఖలు !!

Veldandi Saikiran
ఎరువుల ధ‌ర‌ల పెంపుపై ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీకి  ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. 2022 వ‌ర‌కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌ని 2016లో ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదు. రైతాంగం ఇప్ప‌టికే తీవ్ర న‌ష్టాల్లో ఉంద‌న్నారు. ఎరువుల ధ‌ర‌లు 50 నుంచి 100 శాతం పెరిగాయి. గ‌త 90 రోజులుగా ఎరువుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే అనేక రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. వ్య‌వ‌సాయాన్ని కార్పొరేట్ శ‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర‌లు చేస్తున్నారు. గ‌త ఐదేండ్ల‌లో ఇన్‌పుట్ కాస్ట్ రెట్టింపు అయింద‌న్నారు. గుడ్డిగా కేంద్రం ఎరువుల ధ‌ర‌ల‌ను పెంచుతోంది. యూరియా, డీఏపీ వినియోగం త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌ను చెబుతున్నారు. ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోగా, ఆ భారాన్ని రైతుల‌పై నెడుతున్నారు. దేశంలోని కోట్లాది రైతుల ప‌క్షాన చెబుతున్నా.. ఎరువులు స‌బ్సిడీపై ఇవ్వాలి. రైతుల పెట్టుబ‌డి మొత్తాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
అటు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున్నాను.. తెలంగాణకు విద్యాలయాలు కేటాయించి, తప్పును సరిదిద్దుకోవాలని మోదీకి కేటీఆర్ సూచించారు. తెలంగాణకు విద్యా సంస్థలు కేటాయించాలని అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ.. ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క విద్యాలయాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేయలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. తమిళనాడులో ఒకే రోజు 11 వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని చేసిన కామెంట్ పై  కేటీఆర్ పైవిధంగా స్పందించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు విద్యాలయాలు, వైద్యకళాశాలలను మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిందని కేటీఆర్‌ ఆక్షేపించారు. గిరిజన విశ్వవిద్యాలయం రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నా మంజూరు చేయలేదన్నారు. ఏడు సంవత్సరాల్లో కేంద్రం ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసిన విద్యాసంస్థల వివరాలను మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: