హమ్మా...నన్ను వదిలేస్తే ...నేను ఊరుకుంటానా ఎంటి ?


మరో కొద్ది రోజుల్లో నామినేష్ల ఘట్టం ఆరంభం కానుండగా ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు శీతాకాలం లోనూ మంచి కాక పుట్టుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అధికా పగ్గాలు చేత  చౌపట్టుకుని ఉన్నముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు స్వంత పార్టీ నేతులు నిత్యం షాక్ లు ఇస్తున్నారు. యోగి కూడా తక్కువేం తినలేదు నన్ను వదిలేస్తే నేను ఊరుకుంటానా ? అన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారు ?


భారతీయ జనతా పార్టీలో ఓబీసీ వర్గానికి చెందిన నేత, యోగి క్యాబినెట్ లో అమాత్య పదవిని వెలగబెట్టిన స్వామి ప్రసాద్ మౌర్య తో పాటు మరో నలుగురు  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అది వాళ్లిష్టం, ఇష్టముంటే ఉండవచ్చు, ఇష్టం లేని వాళ్లు వెళ్లి పోవచ్చు అని యుపి బిజేపి నేతలు తమను కలసిన మీడియా జనం ముందు వ్యాఖ్యానించారు. బిజేపి నేతలు అందరూ ఊరుకోవచ్చు.,కానీ యోగీ ఆదిత్యనాథ్ ఊరుకుంటారా ? ఏంటి ?
ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీని వీడిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య పై అరెస్టు వారెంట్ జారీ  అయింది. అది కూడా2014 నాటి కేసుకు సంబంధించి తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ కావడం గమనార్హం. గతంలో ఆయన వేరే పార్టీ ఉండే వారు. ఆ సమయంలో ఆయన దేవుళ్ల పై అసభ్యకరమైన వ్యాఖ్యులు చేశారు. దీంతో నాడు కేసు నమోదైంది. కేసు విచారణ ప్రస్తుతం జరుగుతోంది. ఆయన బుధవారం కోర్టు ముందుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు రాలేదు. దీంతో కోర్టు ఎన్నిసార్లు గైర్హాజరవుతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసాద్ మౌర్యకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సహజంగానే రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
ఇదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ మంత్రి వర్గంలోని  అటవీ శాఖ నిర్వర్తించిన అమాత్యుడు దారా సింగ్ చౌహాన్ కూడా బిజేపికి గుడ్ బై చెప్పేశారు. తాను ఇక నుంచి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో పని చేస్తానని  ప్రకటించారు. మంచి రోజు చూసుకుని ఆయన  పార్టీ లో చేరుతానని తెలిపారు. చౌహాన్ ను బుజ్జగించడానికి  ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ రంగంలోకి దిగారు. అయినా చౌహాన్ తన పట్టు వీడ లేదు. బిజేపితో అన అనుబంధం ముగిసిందని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: