సేమ్ టూ సేమ్: బాబు ఫెయిల్.. కేసీఆర్ సక్సెస్ అవుతారా?

M N Amaleswara rao
సరిగ్గా 2019 ఎన్నికల ముందు ఒకసారి చంద్రబాబు ఎలాంటి రాజకీయాలు చేశారో గుర్తు చేసుకుంటే...ఆయన 2018 నుంచే హడావిడి చేయడం మొదలుపెట్టారు. అప్పటివరకు బీజేపీతో కలిసి ఉన్న ఆయన, ఒక్కసారిగా బీజేపీకి దూరం జరిగారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని చెప్పి బీజేపీపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. అసలు రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ కంటే, బీజేపీనే ఎక్కువ టార్గెట్ చేశారు. ధర్మపోరాట దీక్షలు అంటూ హడావిడి చేశారు.
కేంద్రంలోని మోదీ నాయకత్వానికి చెక్ పెట్టడానికి గట్టిగా ప్రయత్నించారు. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేక పార్టీలని కూడగట్టే ప్రయత్నాలు చేశారు. ఆఖరికి కాంగ్రెస్‌తో కూడా కలిశారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, శరద్ పవార్ అబ్బో ఇలా వరుసపెట్టి జాతీయ నేతలని కలుసుకుంటూ వచ్చారు. అలాగే జాతీయ నాయకులని ఏపీకి ఆహ్వానించారు. వారితో వరుస భేటీలు అయ్యారు. ఇక దీంతో బాబు బీజేపీని కట్టడి చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
తీరా చూస్తే బీజేపీని ఏ మాత్రం దెబ్బకొట్టలేకపోయారు. పైగా రాష్ట్రంలో చంద్రబాబు భారీగా దెబ్బతిన్నారు. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అటు కేంద్రంలో బీజేపీని నిలువరించలేకపోయారు. ఇలా రెండువైపులా బాబు ఫెయిల్ అయ్యారు. అయితే ఇప్పుడు బాబు రూట్‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన బీజేపీపై ఓ రేంజ్‌లో యుద్ధం చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో పోరాడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసే పనిలో పడ్డారు. వరుసపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ నేతలని కలవడం, అలాగే జాతీయ నాయకులని తెలంగాణకు పిలవడం వారితో భేటీ అవ్వడం చేస్తున్నారు. ఇలా వరుసపెట్టి జాతీయ నాయకులని కలుస్తున్నారు. మరి ఇలా సేమ్ బాబు లాగానే ముందుకెళుతున్న కేసీఆర్...సక్సెస్ అవుతారో లేక ఫెయిల్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: