ఏపిలో లాక్ డౌన్ పై జగన్ సర్కార్ క్లారిటీ..!

Satvika
కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్ళీ వేగంగా విజ్రుంభిస్తున్న నేపథ్యం లో ప్రభుత్వాలు కీలక నిర్ణయాన్ని తీసుకుంటూన్నారు.. మళ్ళీ కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లను విధించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పై అనేక పుకార్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మంత్రులు కూడా ఈ విషయం పై ఒక నిర్ణయానికి వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటం తో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. గతం లో పెట్టిన లాక్ డౌన్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్క్కొవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు కేసులు పెరుగుతూన్నాయని ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ పెడతారని కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలను చెస్తున్నారు.

కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌ లో నైట్ కర్ఫ్యూ అమలు లోకి వచ్చిందని.. థియేటర్ల లో 50 శాతం మాత్రమే అక్యుపెన్సీ అంటూ పలు మెసేజ్‌లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రం లో ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ చేసే వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేషించారు. ప్రజలు కరొన పై నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.. గతంలో ఈ కరోనా బారిన పడిన సంగతి అందరికి తెలిసిందే. చాలా మంది ప్రాణాలును కూడా కోల్పోయారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటామని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: