టీడీపీలో ఆ బడా ఫ్యామిలీలకు డబుల్ ధమాకా?

M N Amaleswara rao
ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్...ఇది గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన రూల్...దీంతో కొన్ని ఫ్యామిలీలకు ఒకటే టిక్కెట్ దక్కింది. అయితే కొందరికి మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. దీంతో పలు ఫ్యామిలీలకు రెండు టిక్కెట్లు దొరికాయి. ఇక ఈ సారి ఎన్నికల్లో అలాంటి రూల్ ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలే ముఖ్యం. కాబట్టి స్ట్రాంగ్‌గా ఉన్న ఫ్యామిలీలకు రెండు సీట్లు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అలా పలు ఫ్యామిలీలకు రెండు సీట్లు దక్కనున్నవి.
ఎలాగో శ్రీకాకుళంలో కింజరాపు ఫ్యామిలీకి సీట్లు ఖాయమే. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు బరిలో దిగుతారు. ఇక విజయనగరంలో అశోక్ గజపతి రాజు, ఆయన తనయురాలు అతిథిలు మళ్ళీ పోటీ చేస్తారు. అలాగే విశాఖలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీకి కూడా రెండు టిక్కెట్లు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయ్యన్న ఎలాగో నర్సీపట్నంలో పోటీ చేస్తారు..అటు అయ్యన్న తనయుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  
తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు జగ్గంపేట సీటు...ఆయన తనయుడు నవీన్‌కు కాకినాడ ఎంపీ సీటు దక్కవచ్చని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం రెండు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వేపల్లి, నెల్లూరు పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారని సమాచారం.
 అనంతపురం జిల్లాలో పరిటాల సునీతమ్మకు రాప్తాడు....శ్రీరామ్‌కు ధర్మవరం సీట్లు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి, అనంతపురం ఎంపీ సీట్లు ఫిక్స్. అలాగే కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీకి ఆలూరు అసెంబ్లీ, కర్నూలు పార్లమెంట్ సీట్లు ఫిక్స్ అయ్యాయి. అలాగే భూమా ఫ్యామిలీకి...ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు. ఇక కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ చేతుల్లో ఒక పత్తికొండ మాత్రమే ఉంది...వారు కూడా డోన్ గానీ, ఆలూరు గానీ అడుగుతున్నారు. మరి నెక్స్ట్ ఏ ఫ్యామిలీకి డబుల్ ధమాకా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: