జ‌గ్గారెడ్డి-సోనియా భేటి : రేవంత్‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా..?

Paloji Vinay
గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో జ‌గ్గారెడ్డి వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి వివాదం కొన‌సాగుతోంది. అసంతృప్తి స్వరం వినిపిస్తున్న జగ్గారెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయ‌న‌.. తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని జీవితాంతం ఉంటానని ప్ర‌క‌టించారు. పార్టీకి డామేజ్ చేయాలన్న ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాహుల్ గాంధీని కలిసి తాను నేరుగా వివరిస్తానని పేర్కొన్నారు. పార్టీలో ఎవరైనా ఇబ్బంది పడితే ఒంటరిగానే వుంటాను అని తేల్చిచెప్పారు.

 ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్ర‌వెల్లిలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం ఆ పార్టీలో పెద్ద ర‌చ్చ‌కు దారితీసింద‌నే చెప్పాలి. త‌న‌ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎలా నిర్వహిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, క‌రోనా నిబంధనలు అమలులో ఉన్న‌ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో మాత్రం `రచ్చబండ` కార్య‌క్ర‌మాన్ని చివరికి పార్టీ సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు.


 పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. ఇదే క్ర‌మంలో జ‌గ్గారెడ్డి పార్టీ వీడుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై మాట్లాడిన ఆయ‌న‌తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రెడ్డి ల‌ను క‌లుస్తాన‌ని తెలిపారు. వారి వద్దే తన బాధను వివరిస్తానని చెప్పారు. సోనియా రాహుల్ గాంధీ నాయకత్వంలోని జీవితాంతం పని చేస్తానని చెప్పారు. అయితే, జ‌గ్గారెడ్డి రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా అధిష్టానంతో స‌మావేశం కావ‌డం వెనుక పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ల హ‌స్తం ఉంద‌ని స‌మాచారం. ఒక‌వేళ జ‌గ్గారెడ్డి భేటీ అయితే రేవంత్ రెడ్డికి మైన‌స్‌గా మారే ప‌రిస్థితులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: