ప్రపంచం మొత్తం కరోనా.. కానీ పాకిస్తాన్ లో కొత్త సమస్య?

praveen
ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ మహమ్మారితో ఎంతలా భయపడి పోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తూనే ఉంది. ఒక దశ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రపంచదేశాలు ఆనందపడే లోపే ఊహించని విధంగా రెండవ దశ కరోనా కూడా దూసుకు వస్తుంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని దేశాలు కూడా కరోనా సమస్యను ఎదుర్కొంటున్నాయి. చిన్న దేశాల నుంచి అగ్రదేశాల వరకు కూడా ప్రతి దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

 ముఖ్యంగా అగ్రరాజ్యాలలో అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్  తో ప్రపంచ దేశాలు మరింత భయాందోళనలో మునిగిపోయాయ్.  అయితే ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్ తో భయపడుతూ ఉంటే అటు పాకిస్తాన్లో మొత్తం కొత్త సమస్య వేధిస్తోంది. దాదాపు దాదాపు 14 ఏళ్ల కిందట పాకిస్థాన్లో డెంగ్యూ ఒక రేంజిలో విజృంభించి విపత్కర పరిస్థితులు తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మళ్లీ ఇప్పుడు పాకిస్థాన్ను డెంగ్యూ వెంటాడుతోంది. పంజాబ్ సహా  మరికొన్ని ప్రాంతాలలో కూడా భారీగా కేసులు వెలుగులోకి వస్తుండడంతో పాకిస్ధాన్ ప్రజలు భయాందోళనలో మునిగిపోతున్నారు.


ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిన వేళ ప్రస్తుతం డెంగ్యూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం మాత్రం మరింత ఆందోళనకరంగా మారి పోయింది. ఈ క్రమం లోనే రానున్న రోజుల్లో అటు పాకిస్థాన్ ప్రభుత్వం డెంగ్యూ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇక ఇలాగే కేసులు పెరిగితే మాత్రం ప్రమాదకర పరిస్థితులు వస్తాయి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: