యూపీ పాలిటిక్స్ : రాహుల్‌, దీది దారిలో అఖిలేష్‌..?

Paloji Vinay
దేశ వ్యాప్తంగా యూపీ ఎన్నిక‌లు ఉత్కంఠ‌గా మారుతున్నవేళ‌.. అన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే వ్యూహాలు సిద్దం చేసుకుంటూ.. ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైన త‌మ స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్‌, మ‌రోసారి అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ లు ఉంటే.. మ‌రోవైపు ఈ రెండు పార్టీల‌పై వ్య‌తిరేక‌త పెరుగుతున్న వేళ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని గెలుపొందాల‌ని స‌మాజ్‌వాదీ పార్టీ చూస్తోంది. ఇదే క్ర‌మంలో ఆ పార్టీ అధినే, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ఆస‌కిక్త‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం చేపట్టి.. రామరాజ్యాన్ని స్థాపిస్థాన‌ని ప్ర‌తి రోజు త‌న క‌ల‌లోకి శ్రీ‌కృష్ణుడు వ‌చ్చి చెబుతున్నాడ‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం దేశ వ్యాప్తంగా ఆస‌క్తిగా మారాయి.

     బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు స‌మాజ్‌వాదీ పార్టీలో చేరిన స‌మ‌యంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో అఖిలేష్ యాద‌వ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్పీ అధికారంలో వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  ‘సమాజ్‌వాద్ (సోషలిజం) ద్వారా రామరాజ్యానికి మార్గమ‌ని,  సమాజ్‌వాద్‌ ఏర్పాటైన రోజునే రాష్ట్రంలో ‘రామరాజ్యం’ ఏర్పాటవుతుంద‌ని..  శ్రీ‌కృష్ణుడు ప్రతి రోజు రాత్రి త‌న కలలోకి వచ్చి మాట్లాడుతున్నాడ‌ని చెప్పారు. యూపీలో యోగి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే, దేశంలో ప్ర‌స్తుతం హిందువుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాల్లో భాగంగానే అన్ని పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అయోధ్య రామ‌మందిర నిర్మాణం ప్రారంభం కావడం.. మ‌ధుర ఆల‌య నిర్మాణం, బృందావ‌నం  నిర్మాణం చేస్తామ‌ని బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే హామీలు ఇస్తున్న వేళ‌.. అఖిలేష్ హిందువుల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి చూస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ‌కృష్ణుడు త‌న‌తో మాట్లాడిన‌ట్టు చెప్పుకుంటున్నాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో  రాహుల్ గాంధీ ఓ స‌భ‌లో తాను పండిట్ అని చెప్పుకోవ‌డానికి చొక్కాపై జంజం ధ‌రించిన విష‌యం తెలిసిందే.. అలాగే, ఎన్న‌డు ఆల‌యాల‌కు వెళ్ల‌ని రాహుల్ తొలిసారిగా ఆల‌యాన్ని సంద‌ర్శించారు.


ప‌శ్చిమ బెంగాల్‌లో కూడా మ‌మ‌త తాను హిందువున‌ని ప్ర‌క‌టించుకుంటూ పూజ‌లో పాల్గొని మంత్రాలు జ‌పించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ఆల‌యాల‌ను సంద‌ర్శించి బ‌హిరంగ స‌భ‌లో నేను కూడా హిందువునే అని చెప్పుకొచ్చారు. వీళ్ల అడుగుజాడ‌ల్లోనే అఖిలేష్ యాద‌వ్ కూడా వెళ్తున్న‌ట్టు తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్టం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: