ఎలాన్ మస్క్‌ అద్భుతం: అంతరిక్షంలో పని చేసే ఫోన్‌..?

Chakravarthi Kalyan
ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళ్లామనుకోండి.. అక్కడ ఫోన్‌ సిగ్నల్స్‌ అందక చాలా ఇబ్బంది పడతాం. కొన్ని సార్లు నగరాల్లోనూ ఇలాంటి సిగ్నల్స్ ఇబ్బందులు వస్తుంటాయి. మరి అలాంటిది అంతరిక్షంలో ఫోన్‌ పని చేస్తుందా.. ఈ ప్రశ్న వింటే ఎవరైనా అసాధ్యం అనే చెబుతారు.. కానీ.. అలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయాలని ప్రయత్నించడమే మానవ నైజం.. అలాంటి నైజం ఫుల్లుగా ఉన్న ఎలాన్ మస్క్ ఇప్పుడు అంతరిక్ష ఫోన్‌ను ఆవిష్కరించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఎలాన్‌ మస్క్‌.. అమెరికాకు చెందిన ఈ వ్యాపారవేత్తగా అద్భుతాలు సృష్టించడం అంటే మహా ఇష్టం.. అంతరిక్షం.. అన్నా మహా మక్కువ.. అందుకే ఆయన తాను మార్స్ గ్రహంపై చనిపోవాలనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. అందుకే ఆయన స్పేస్ ట్రావెల్స్ ప్రయోగాలు చేస్తున్నాడు.. ఏకంగా స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థను స్థాపించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన అంతరిక్షంలోకి వెళ్లి వచ్చే ప్రయోగం కూడా విజయవంతంగా చేశారు.

అంగారక గ్రహాన్ని కాలనీగా మార్చాలన్నది ఎలాన్ మస్క్ డ్రీమ్.. మరి అలాంటి పరిస్థితి వస్తే.. అక్కడ కమ్యూనికేషన్‌ ఎలా.. అందుకే అంతరిక్షంలో పని చేసే ఫోన్‌ను కూడా ఎలాన్‌ మస్క్ రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఎలాన్ మస్క్ తన టెస్లా విద్యుత్ కారుతో కార్ల మార్కెట్‌ ను మార్చేశారు. విద్యుత్ కార్లు అనేది ఓ సాధ్యం కాని ఐడియా అన్న ఆలోచన ఉండేది.. దాన్ని సుసాధ్యం చేసి ఇప్పుడు టెస్లా కార్లు ప్రపంచంలో పరుగులు పెట్టేలా చేసిన ఘనత ఎలాన్‌ మస్క్‌ది.

ఇప్పుడు ఆయన బుర్ర నుంచి వచ్చిన ఈ అంతరిక్ష ఫోన్ ఐడియా కూడా అలాగే సంచలనాలు సృష్టంచే అవకాశం ఉంది. ఎలాన్‌ మస్క్‌ తీసుకువస్తారని భావిస్తున్న ఫోన్‌కు పేరు కూడా ఖరారు చేశారట. ఆ ఫోన్‌ పేరు పై స్మార్ట్‌ఫోన్‌. ఈ ఫోన్‌ తీసుకుని అంతరిక్షంలోకి అంగారక గ్రహానికి వెళ్లినా అక్కడ నుంచి భూమి మీద ఉన్న వారితో మాట్లాడొస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: