ఆ ఎంపీలు మళ్ళీ ఎమ్మెల్యేలుగా?

M N Amaleswara rao
తెలంగాణలో రాజకీయంగా సత్తా చాటాడానికి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, తొలిసారి అధికారంలోకి రావడానికి బీజేపీలు తమదైన శైలిలో వ్యూహాలు పన్నుకుంటూ ముందుకెళుతున్నాయి. అయితే గెలుపు కోసం కలిసొచ్చిన ప్రతి వ్యూహాన్ని అమలు చేయాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో బలమైన నాయకుల అందరీని అసెంబ్లీ ఎన్నికల బరిలో దించేయాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు.
ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేరు వేరుగా జరగనున్నాయి. మొదట అసెంబ్లీ ఎన్నికలు మొదట జరగనున్నాయి కాబట్టి...ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో కొడంగల్‌లో పోటీ చేసి రేవంత్ ఓడిపోయి..మళ్ళీ మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
ఇక ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కొడంగల్‌ బరిలో దిగడం ఖాయం. అటు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి...హుజూర్‌నగర్‌లో పోటీ చేయనున్నారు. అలాగే భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి...నల్గొండ అసెంబ్లీలో పోటీకి దిగుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి నల్గొండలోనే పోటీ చేసి ఓడిపోయారు.
ఇటు వస్తే బీజేపీలో నలుగురు ఎంపీలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ బరిలో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. గత అసెంబ్లీలో ఈయన అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...అంబర్‌పేటలో పోటీకి దిగుతారు. గత ఎన్నికల్లో ఈయన అదే స్థానంలో ఓడిపోయారు. అటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు...బోథ్ అసెంబ్లీలో పోటీ చేస్తారని తెలుస్తోంది. మరి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్... వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: