ఆ వైసీపీ నేత‌తో కాస్త క‌ష్ట‌మేనా... ప‌వ‌న్ క‌లిసొస్తే చెక్ ఖాయమే..!

VUYYURU SUBHASH
శ్రీకాకుళం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. మొదట నుంచి పార్టీకి అనుకూలం ఉన్న జిల్లా. ఇక్కడ మెజారిటీ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లోనే జిల్లాలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. జిల్లాలో 10 సీట్లకు కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే రెండున్నర ఏళ్లలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయింది. వైసీపీ సిట్టింగ్ సీట్లలో టీడీపీ నేతలు పుంజుకున్నారు.
అయితే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మాత్రం పరిస్తితి అర్ధం కావడం లేదు. మొదట నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోటే. 1983 నుంచి 1999 వరకు అయిదుసార్లు గెలిచింది. 2004లోనే ధర్మాన ప్రసాదరావు టీడీపీ విజయానికి బ్రేక్ వేశారు. అలాగే 2009లో కూడా ఆయనే మళ్ళీ విజయం సాధించారు. 2014లో మళ్ళీ టీడీపీ సత్తా చాటింది. 2019 ఎన్నికలోచ్చేసరికి ధర్మాన మళ్ళీ గెలిచేశారు. వైసీపీ నుంచి విజయం సాధించారు.
ఇక ఈ రెండున్నర ఏళ్లలో ధర్మానపై పెద్దగా వ్యతిరేకత వచ్చినట్లు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా కాస్త పర్వాలేదనిపిస్తున్నారు. జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే...ధర్మాన బెటర్ అనిపిస్తున్నారు. అందుకే ఇక్కడ టీడీపీకి పెద్దగా అవకాశం దొరికినట్లు కనిపించడం లేదు. అయితే మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీ పార్టీని బలోపేతం చేయడానికి బాగానే కష్టపడుతున్నారు. కాకపోతే వయసు మీద పడటంతో ఎక్కువ యాక్టివ్‌గా తిరగలేకపోతున్నారు. అందుకే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఎలాగో తన పార్లమెంట్ పరిధిలో కీలకంగా స్థానం కాబట్టి...అసెంబ్లీపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. కానీ లక్ష్మీ కాస్త యాక్టివ్‌గా తిరగకపోవడంతో రామ్మోహన్ సపోర్ట్ ఇస్తున్నారు. అయినా సరే ఇక్కడ ధర్మానని ఓడించడం కాస్త కష్టమయ్యేలా ఉంది. అయితే జనసేన గానీ నెక్స్ట్ టీడీపీతో కలిస్తే ధర్మానకు చెక్ పెట్టేయొచ్చు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: