హైదరాబాద్లో మరో వ్యాధి.. చాపకింద నీరులా?

praveen
మనిషి ప్రాణాలకు గ్యారంటీ లేదు అన్నది అందరికీ తెలిసిన నిజమే. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు మనిషి ప్రాణంపై ఆశ లేకుండా పోయింది. ఎందుకంటే ఒకవైపు కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను తీస్తుంది. మరోవైపు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూ మనుషుల ప్రాణాలు తీయడానికి దూసుకు వస్తూ పంజా విసురుతు ఉన్నాయి. ఇలా ఇప్పటికీ కరోనా వైరస్ తో అల్లాడి పోతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ లాంటివి ఎంతోమంది ప్రాణాలు తీస్తూ ఉండడం గమనార్హం. ఇలా  ఒకవైపు కరోనా వైరస్ నుంచి తప్పించుకున్న.. ఎలా ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

 దీంతో నేటి రోజుల్లో మనిషి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయి అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. అయితే తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్లో మరో క్రొత్త వ్యాది చాపకింద నీరులా పాకిపోతోంది అన్నది అర్ధమవుతుంది. బుష్ టైపస్ అనే వ్యాధి బారిన పడుతున్నారు ఎంతోమంది. ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రిలో 15 మంది ఈ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలే ఉన్నారు అని అంటున్నారు నిపుణులు.  ఒక్క నెలలోనే నలుగురు చిన్న పిల్లలు వ్యాధి బారిన పడగా.. వారిలో ఇద్దరికి తగ్గిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

 అయితే ఈ వ్యాధి ఎలా సోకుతుంది అన్నది మాత్రం చాలా మందికి తెలియని ప్రశ్న. ఇళ్లల్లో, పెరటి మొక్కల్లో చిత్తడి ప్రాంతాలలో ఉండే నల్లి వంటి చిన్న పురుగులు (లార్వాల్ మైట్స్ )కుట్టడం ద్వారా ఇక ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు అంటున్నారు. ఇళ్లల్లో మంచాలు తడి ప్రాంతాల్లో ఈ పురుగులు ఉంటాయని అచ్చం నల్లుల మాదిరిగానే తిరుగుతూ ఉంటాయి అంటూ చెబుతున్నారు.. పగలు కంటే రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ పురుగులు. ఇక ఈ పురుగు కుట్టిన తర్వాత జ్వరం ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు లాంటివి వస్తాయని.. ఇక కొంతమందిలో ఒంటిపై దద్దుర్లు సైతం వస్తాయి అని అంటున్నారు.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: