బూస్టర్ డోస్ గా నేజల్ డోస్..!

NAGARJUNA NAKKA
దేశీయ వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్ సంస్థ తాను తయారు చేస్తున్న ఇంట్రా నేజల్ వ్యాక్సిన్ కు బూస్టర్ డోసుగా ఇవ్వడనికి అనుమతి కోరింది. ఇందుకు సంబంధించిన ఫేజ్ 3 ట్రయల్స్ కు భారత డ్రగ్స్ కంట్రోల్ జనరల్ పర్మిషన్ కు రిక్వెస్ట్ చేసింది. ట్రయల్స్ లో ఈ టీకా సురక్షితమని తేలితే.. ఇప్పటికే కొవాగ్జిన్ 2డోసులు వేసుకున్న వారికి బూస్టర్ డోసుగా ఈ నేజల్ డోస్ వేస్తారు.మరోవైపు తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ వయల్ ను 2 నుండి 8డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంచుతూ 28రోజుల పాటు వాడుకోవచ్చని భారత బయోటెక్ తెలిపింది. ప్రస్తుతం తెరిచిన ఒక వయల్ లోని టీకాను నాలుగు గంటల్లోగా వినియోగిస్తున్నారు. తాజా నిర్ణయంతో తెరిచి ఉంచిన వయల్ లోని మిగిలిన టీకా వృథా కాకుండా చూడవచ్చని భారత్ బయోటెక్ అభిప్రాయపడింది.
ఇక డెల్టా వేరియంట్ లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్ తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యులు ఏంజెలిక్ కోట్జీ అన్నారు. తాను ఇప్పటి వరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశాననీ.. సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. అయితే కోట్జీ ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించి ఆ దేస వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని పలు దేశాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్ సోకి ప్రాణాలు విడిచినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక బ్రిటన్ లో ఇప్పటికే 12 ఒమిక్రాన్ మరణాలతో తీవ్ర కలవలం మొదలైంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నమోదైన నాలుగు ఒమిక్రాన్ కేసుల్లో ఒకరు ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ బాధితుడికి వైద్యం చేయగా.. ఆయనకు వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వైద్యుడితో పాటు ఆస్పత్రిలోని ఆయన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ క్వారంటైన్ కు తరలించి టెస్టులు చేయిస్తోంది యాజమాన్యం. ఇక విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణీకుల్లో 20మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. అయితే వీరిలో నలుగురు విదేశీయులు మినహా మిగిన వారికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. అయితో సోమాలియా, కెన్యాకు చెందిన నలుగురు క్యాన్సర్ బాధితులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు. వీరిలో ఒమిక్రాన్ బయటపడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.





 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: