తక్కువ ఖర్చుతోనే హక్కులు వస్తాయంటున్న సభాపతి..!

Podili Ravindranath
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో సర్వ హక్కులు కలిగి ఉంటారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కళామందిర్‌లో ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం... టైటిల్ డీడ్ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో అభివృద్ధి సంక్షేమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. 1983 నుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉన్నాయన్నారు. లబ్ధిదారులు తరఫున ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని భరిస్తుందని తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ అయినప్పుడే లబ్ధిదారులు వినియోగించుకున్న నాడే సర్వ హక్కులు ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆస్థి పొందాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే బ్యాంకు వారు వచ్చి రుణాలు వసూలు చేస్తారని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు  దేశంలో గొప్ప పథకమని వివరించారు.
లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ సాయి రాజ్. ఉంటున్న గృహంపై సర్వ హక్కులు కలిగి ఉంటామని గమనించి మీ గృహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. గత 30 సంవత్సరాల నుండి తమ గృహాలలో నివాసం ఉంటున్నారని, కానీ.. ఆ గృహంపై సంపూర్ణ హక్కులు ఉండవన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్. అలాంటి గృహాలను నామినల్ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ గృహంపై సర్వ హక్కులు పొందాలని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ కోరారు. ఈ లబ్ధిదారులందరూ ముందుకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన గృహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వివరించారు. ఈ పథకం పై గ్రామ స్థాయి నుండి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టాతో పాటు రిజిస్ట్రేషన్ జరుగుతుందని, ఆ గృహం పై సర్వ హక్కులు ఉంటాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: