చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

Chandrasekhar Reddy
ఎదుగుతున్న వాడిని చూస్తే ఏడ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ అలా ఎదగాలి అనుకున్నవాడు, తనకు ఇతరులు అడ్డుగా ఉంటారేమో అనో లేదా వాళ్ళను తన ఎదుగుదలకు వాడుకుందాం అనో అనుకుంటేనే ప్రమాదం వస్తుంది. ఇలా ఎదిగిన వాడిని చూసే వాడు ఉండబోడు, వాడిని చూసి ఏడ్చే వాడు కూడా ఉండబోడు. ఇప్పుడు అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలన్ని ఒకనాడు ఇలాంటి రెండు ముఖాలతో బ్రతికినవే. ముందు స్నేహాలంటారు, వెనకాల చిచ్చుపెట్టే పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం తీవ్రవాద సంస్థలను సృష్టించేది వాళ్ళే, వాటిని ఆయా దేశాలపైకి ఉసిగొలిపి వాటిని దెబ్బగొట్టి, తమ స్థాయి ఎప్పుడు పై చేయిగా చూసుకునేది వాళ్ళే. ఆయా బాధిత దేశాలు తీవ్రవాదులపై యుద్దానికి బయలుదేరితే, వాళ్ళను సృష్టించడానికి ఖర్చు బోలెడు అయ్యింది కాబట్టి, అది నష్టం అవుతుందనే ఉద్దేశ్యంతో, వాళ్ళతో శాంతి చర్చలు అంటూ నాటకాలు ఆడేది వీళ్లే.
ఇలాంటి రెండు ముఖాల దేశాలతో తిప్పలు పడిన వారు అనేకం. విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతి అంటూ ఆయా తీవ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా వాళ్ళ రెండో ముఖానికి సాక్ష్యం. దానితో ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోవడం, ప్రతిదానికి ఈ అగ్రరాజ్యాలపై ఆధారపడటం చేస్తాయి కాబట్టి, వీళ్ళ వ్యాపారం బాగుటుంది. అంటే గాయం చేసేది వాళ్ళే వైద్యం అంటూ డబ్బులు లాగేసుకునేది వాళ్లే. ఇలాంటి వ్యవస్థలను ఇక సహించేది లేదనే నిర్ణయానికి {{RelevantDataTitle}}