థర్డ్ వేవ్ వస్తే తాము ఏం చేస్తారో చెప్పిన యూపీ సీఎం..!

NAGARJUNA NAKKA
కరోనా థర్డ్ వేవ్ వస్తే తాము అడ్డుకొని తీరుతామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆగస్ట్ లో థర్డ్ వేవ్ కరోనా వస్తుందని కొందరు.. సెప్టెంబర్ లో వస్తుందని మరికొందరుఅంటున్నారని చెప్పారు. ఒకవేళ తాము తిరిగి అధికారంలోకి వస్తే కరోనా థర్డ్ వేవ్ ను అడ్డుకుంటామని యోగి అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సీఎం అన్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైద్యులు జారీ చేసిన 22వేల 915 మరణ ధృవీకరణ పత్రాల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత కారణంగా మరణించినట్టు ప్రస్తావన రాలేదనీ.. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చెబుతున్నవి తప్పుడు లెక్కలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధానిలో నాలుగు ఒమిక్రాన్ కేసులు వచ్చినట్టు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంకాంగ్ లో చేసిన ఓ అధ్యయనం తెలిపింది.
మరోవైపు గడిచిన 24గంటల్లో దేశంలో 7వేల 974కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343మంది వైరస్ తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 76వేల 478కి చేరింది. మరోవైపు తాజాగా 7వేల 948మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3కోట్ల 41లక్షల 54వేల 879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87వేల 245కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 135.25కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో గుబులు రేకెత్తిస్తున్న వేళ.. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేలా కనిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: