పతనమవుతున్న పాత్రికేయ స్వేచ్చ

ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయుల మీద దాడులు ఏందుకు జరుగుతున్నాయి? నిజాలను నిర్భయంగా వెల్లడించడానికి రానున్న రోజుల్లో ఇంక చోటు లేదా ? 

ప్రముఖ పాత్రికేయ స్వచ్ఛంద సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ ఎస్ ఎఫ్) సంస్థ గత 25 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాత్రికేయుల అరెస్ట్ లు , హత్యలు గురించి సేకరించిన వివరాలు గురించి ప్రచురిస్తూ ఉంది. ఈ సంవత్సరం ప్రచురించిన నివేదిక ద్వారా  కొన్ని  నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

గతంలో ఎన్నడూ లేని విధంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 488మంది పాత్రికేయులు అరెస్ట్ అవ్వగా , 46 మందిని హతమార్చినట్లు తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నివేదికలో ఏం పేర్కొన్నారు అంటే మధ్యాసియా లో వివాదాలు దాదాపు సద్దుమణిగడంతో గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం పాత్రికేయ హత్యలు తగ్గినా ,  అరెస్ట్ లు మాత్రం గతంలో కన్నా ఎక్కువగా జరిగాయి. 

 ఈ సంవత్సరం అరెస్ట్ అయ్యిన పాత్రికేయులలో మొగవారి కంటే మహిళలు అధికంగా ఉండటం గమనార్హం. మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా 60 మంది పాత్రికేయులు అరెస్ట్ అయ్యారు. 

ఈ ఏడాది జరిగిన 46 హత్యాల్లో ఎక్కువ భాగం ఉద్దేశపూర్వకంగా పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని జరిగినవిగా నివేదిక పేర్కొంది. ఉత్తరమెరిక లోని మెక్సికో , తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లలో అత్యధికంగా హత్యకు గురయ్యారు.

 దేశాలు వారిగా గణాంకాలలోకి వెళితే ఆసియా దేశాలైన చైనా లో 127 మంది ని అరెస్ట్ చేసి మొదటి స్థానంలో నిలవగా, మయన్మార్ 53 మందితో రెండు స్థానంలో , వియత్నాం లో 43 మంది తో మూడో స్థానం, సౌదీఅరేబియా, హాంకాంగ్ మరియు యూరోప్ లోని  బెలారస్ దేశాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

 మీద గత కొన్ని సంవత్సరాలుగా యూరోప్,  ఆసియా ఖండాల లోని పలు దేశాల్లో  మీడియా మీద ఆంక్షలు అధికం అవుతున్నాయి అని సంస్థ పేర్కొంది. పాత్రికేయ స్వేచ్చ ను హరించే విధంగా పాలకుల చర్యలు ఉండటం విచారకరం అని కూడా పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: