వెరీ స్పెషల్‌: ఆ టీ పొడి.. కిలో రూ. లక్ష మాత్రమే..!

Chakravarthi Kalyan
ఇండియాకు ఏ ముహూర్తాన ఆ తెల్లవాళ్లు ఈ చాయ్‌ తీసుకొచ్చారో కానీ.. ఈ చాయ్ ఇండియన్లకు ఓ మానలేని అలవాటుగా మారింది. అయితే.. చాయ్‌ లిమిటెడ్ గా తీసుకునే మానాల్సిన అవసరం కూడా లేదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క చాయ్‌ కొడితే హుషారు వచ్చేస్తుంది. పనిలో జోరు పెరుగుతుంది. చాలా మందికి ఓ చాయ్ పడితే ఆలోచనలు వెల్లువలా వస్తాయి. అయితే.. ఈ చాయ్‌లోనూ ఎన్నో రకాలు.. ఎన్నో ప్రత్యేకతలు..

సాధారణంగా కిలో టీ పొడి ఎంత ఉంటుంది.. మహా ఉంటే 300 రూపాయలో 400 వందల రూపాయలో ఉంటుంది. అయితే.. అస్సామ్‌లో దొరికే కొన్ని ప్రత్యేకమైన రకాలకు అంతకు కొన్ని వందల రెట్ల ధర ఉంటుందంటే నమ్ముతారా.. ఇవాళ ప్రపంచ టీ దినోత్సవం.. ఈ సందర్భంగా ఓ విశేషం చెప్పుకుందాం. అదే ఈ కథనం.. అస్సామ్‌లో ఓ అరుదైన రకం టీ పొడి వేలంలో భారీ ధర పలికింది. గౌహతిలో నిన్న నిర్వహించిన వేలంలో కిలో టీ పొడి... అక్షరాలా 99వేల 999 రూపాయలు పలికి రికార్డు క్రియేట్ చేసింది. ఈ రకం ఏంటో తెలుసా.. మనోహరి గోల్డ్‌ రకం టీ పొడి.

ఈ మనోహరి గోల్డ్ రకం గత రికార్డును మరోసారి తిరగరాసిందని గౌహతి టీ వేలం కేంద్రం కార్యదర్శి చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ వేలంలో ఇదే టీ పొడి 75 వేలు పలికింది. అదే ఈసారి ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. ఈ మనోహరి రకం టీ పొడిని విదేశీ కొనుగోలుదారులు సైతం భారతదేశ ప్రత్యేక టీ పొడిగా గుర్తించి ఇష్టపడుతున్నారట.

ఇవే కాదండోయ్.. ఇంకా చాలామంది టీ పొడి అమ్మకందారులు మరిన్ని ప్రత్యేకమైన టీలతో భారత్‌ను ప్రత్యేకే టీల హబ్‌గా మార్చాలని అంటున్నారు. ఇక అస్సాం విషయానికి వస్తే ఇక్కడ  850కి పైగా టీ తోటలు ఉన్నాయి. ఈ అస్సాం ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో టీ ని ఉత్పత్తి చేసే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇంకో విశేషం ఏంటంటే.. భారతదేశ మొత్తం టీ ఉత్పత్తిలో దాదాపు 52 శాతం వాటా అస్సామ్‌దే నట.. ఈ అస్సామ్‌ ఏటా 65కోట్ల కిలోల పొడిని ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tea

సంబంధిత వార్తలు: