కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.


కుల ప్రాతిపదికన రిజర్వేషన్ లు రద్దు చేయలి., ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అనవసరం. దేశంలో దాదాపు ఎనభై శాతానికి పైగా ప్రజలు కుల రిజర్వేషన్ పద్దతికి విసిగి వేసారిపోయారు. పాలకులు స్పందించి రిజర్వేషన్లు రద్దు చేయకుంటే ఇప్పటి వరకూ రిజర్వేషన్ పొందిన వారి దగ్గర నుంచే నిరనను ఎదుర్కోవలసి వస్తుంది అని సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి పేర్కోన్నారు. ఇంతకీ ఎవరా మాజీ సిఎం.
కుల ప్రాతిపదికన రిజర్వేషన్ లు ఏర్పాటు చేయడం వల్ల రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదు.  నిజమైన పేద ప్రజలకు ఫలాలు అందాలి. భారత్ లో చాలా మంది ఇంకా ఆకలితోనే అలమటిస్తున్నారని,  పలు ఆంతర్జాతీయ సంస్థలు తమ నివేదికల్లో సూచిస్తున్నాయి. ఇంకెంత కాలంఈ పరిస్థితి నెలకొని ఉంటుందో తెలియదు అని హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్ పేర్కోన్నారు.  సమాజీక మాధ్యమాల వేదికగా ఆయన తన అభిప్రాయాలను జనావళితో పంచుకున్నారు. భారత్ లో  గతంలో పాలించిన పాలకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అడ్డదార్లు తొక్కారని ఆయన విమర్శించారు. భారత్ లో దాదాపు ఎనభై శాతం మందికి పైగా ప్రజలు రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. భారత్ ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని, పాలకులు వాటి పై స్పందించడం లేదని వాపోయారు.క్రీమీలేయర్ పై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను  మనమంతా  మరొక్కసారి మననం చేసుకోవాలని  శాంత కుమార్ సూచించారు. గతంలో సుప్రీం కోర్టు క్రీమిలేయర్ ను పరిగణన లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కోందని కుమార్ తెలిపారు. గతంలో  అదిక ఆదాయ వర్గాల ప్రజలు ప్రభుత్వ  సబ్సీడీలు వద్దని స్వచ్చందంగా  ముందుకు వచ్చారని ఆయన పేర్కోన్నారు. అదే విదంగా దేశం లోని కొన్ని ప్రాంతాలలో అధికా ఆదాయం ఉన్న వ్యక్తులు కుల రిజర్వేషన్ లను తీసుకునేందుకు వ్యతిరేేకిస్తున్నారని పేర్కోంటూ... వారి కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన వాడల లోనూ వారు నివాసం ఉండటం లేదన్నారు. జన జీవన స్రవంతిలో ఒక భాగంగా వారు అందరితో కలసి మెలసి జీవిస్తున్నారని శాంత కుమార్ తెలిపారు. తన అభిప్రాయాలను  లేఖ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారికి  పంపినట్లు శాంత కుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: