ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

N ANJANEYULU
 భార‌త‌ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి టీపీసీసీ అధ్య‌క్షులు, మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఇవాళ లేఖ రాసారు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌లో నాలుగు గ‌నుల‌ను ప్ర‌యివేటు ప‌రం చేసేందుకు జ‌రుగుతున్న ప్ర‌యత్నాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌ధానినీ రేవంత్‌రెడ్డి కోరారు. సింగ‌రేణి కాల‌రీస్‌లోని నాలుగు బొగ్గు గ‌నుల బ్లాకుల‌ను వేలం వేయాల‌ని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని, వాటిని ఎస్‌సీసీఎల్‌కు కేటాయించాల‌ని అభ్య‌ర్థించారు.
బొగ్గు విక్ర‌యం కోసం బొగ్గు గనుల వేలం కోసం మూడో విడుత‌లో సింగ‌రేణి కాల‌రీస్‌లోని నాలుగు బొగ్గు బ్లాకుల‌ను వేలం వేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం బొగ్గు మంత్రిత్వ‌శాఖ ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకున్నద‌నే.. మీ దృష్టికి తీసుకురావాల‌నుకుంటున్నాన‌ని పేర్కొన్నారు రేవంత్‌రెడ్డి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప‌వ‌ర్ ప్లాంట్ తీవ్ర‌మైన బొగ్గు కొర‌త‌ను ఎదుర్కుంటున్నాయ‌ని, తెలంగాణ‌లో థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా నిలువ‌లున్నాయి. సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటేడ్ నుంచి త‌గినంత బొగ్గు స‌ర‌ఫ‌రా కార‌ణంగా మాత్ర‌మే ఇది సాధ్య‌మైన‌ది.
SCCL అనేది 51:49 ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తో తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం యొక్క జాయింట్ వెంచర్ అని లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం 45 గ‌నుల నుంచి బొగ్గును ఉత్ప‌త్తి చేస్తున్న‌ద‌ని, 1200ఎండబ్ల్యూ ప‌వ‌ర్ ప్లాంట్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. 2019-20లో ఉత్ప‌త్తి చేయ‌బ‌డిన 64.02 Mt బొగ్గులో, దక్షిణ ప్రాంతంలోని విద్యుత్ ప‌రిశ్ర‌మ‌కు సుమారు 52.95  మెట్రిక్ ట‌న్నులు అందించ‌బ‌డుతుంద‌ని, 2023-24 నాటికి  80 Mt  కి చేరుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్ప‌త్తిలో దాదాపు 80 శాతం వ‌ర‌కు విద్యుత్ ప‌రిశ్ర‌మ‌కు వెళ్తుంద‌ని పేర్కొన్నారు.
విద్యుత్ ప్లాంట్ల ద్వారా థర్మల్ బొగ్గు దిగుమతిని తగ్గించేందుకు అదనంగా 11 MTY బొగ్గును ఉత్పత్తి చేయాలని ఎస్‌సీసీఎల్‌ ప్రతిపాదించిన‌ది. ఇప్పటికే ఉన్న గనులు/మైనింగ్ లీజుల పొడిగింపు అనేది అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం.. నిల్వల పరిరక్షణ కోసం మాత్రమే సాంకేతికంగా సాధ్యమవుతుందన్నారు. ఇప్ప‌టికే గనుల విస్తరణ ఈ 4 బొగ్గు బ్లాకుల పరిధిలోకి వస్తుందన్నారు. కోయ‌గూడెం బ్లాక్‌-భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా, స‌త్తుప‌ల్లి బ్లాక్‌-ఖ‌మ్మం జిల్లా, శ్రావ‌ణ‌ప‌ల్లి-మంచిర్యాల జిల్లా, క‌ళ్యాణి బ్లాక్- మంచిర్యాల జిల్లాలో బొగ్గు అమ్మ‌డానికి వేలం కోసం మూడు విడుత‌లో సింగ‌రేణి కాల‌రీస్ లో నాలుగు బొగ్గు బ్లాకుల‌ను వేలం వేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకుంది.
అక్టోబ‌ర్ 10, 2021న నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. అన్నీ వాటాదారుల ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఉంది. స‌త్తుప‌ల్లి నుంచి బొగ్గు ఉత్ప‌త్తి త‌ర‌లింపున‌క‌కు కోయ‌గూడెం నుంచి స‌త్తుప‌ల్లి వ‌ర‌కు రైల్వే లైన్ వేయ‌డానికి సుమారు రూ.750 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డంతో ఆ ప్రాంతంలో అన్వేష‌ణ‌లో సుమారు 70కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డంతో ఎస్‌సీసీఎల్ కు భారీ న‌ష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా నాలుగు బొగ్గు బ్లాకుల‌ను వేలం వేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ డిసెంబ‌ర్ 09, 2021 నుంచి మూడు రోజుల స‌మ్మెకు పిలుపునిచ్చార‌ని చెప్పారు. అయితే ఎంఎండీఆర్ చ‌ట్టం 1957లో సెక్ష‌న్ 1ఐఏ కింద పేర్కొన్న నాలుగు బ్లాకుల వేలానికి వెంట‌నే నిలిపివేయాల‌ని.. వాటిని ఎస్‌సీసీఎల్‌కు బ‌దిలీ చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్టు రేవంత్‌రెడ్డి లేఖ‌లో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: