వాటర్ ట్యాంక్ లో 50 రోజులుగా శవం ఆందోళనలో పిల్లలు, వృద్దులు...

VAMSI
ప్రభుత్వాలు ప్రజల సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని సార్లు ప్రమాదవశాత్తూ కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ప్రజల ఆరోగ్యానికి చెడు కలిగించనంత వరకు కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అయితే ఈ ఘటనల వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే మీడియా మరియు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒక్కటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ముషీరాబాద్ లోని రిసాల గడ్డ వాటర్ ట్యాంక్ లో కుల్లి పోయిన శవాన్ని గుర్తించడం జరిగింది. సంతోష్ నగర్ లో ప్లై ఓవర్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు అక్కడ అడ్డుగా ఉన్న కృష్ణా వాటర్ పైప్ లైన్ ను పక్కన జరపడానికి జల మండల సిబ్బంది వెళ్లారు. అయితే అక్కడ వాటర్ సమస్య తలెత్తడంతో ట్యాంక్ ను క్లీన్ చేసే సమయంలో శవాన్ని గుర్తించారు.
ఈ విషయం తెలియగానే ఒక్క సారిగా ఆ ప్రాంత వాసులు అందరూ షాక్ అయ్యారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం  ఈ శవం దాదాపుగా 50 రోజుల ముందు నుండే ఈ ట్యాంక్ లో పడి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు శవం నీటిలో ఉండడం వల్ల బాగా కుళ్లిపోయింది. ఈ ట్యాంక్ లో ఉన్న నీరు శివ స్తాన్ పుర్, ఎస్ ఆర్ కె నగర్, పద్మశాలి సంఘం, జాతి నగర్ కాలనీ లలో జీవించే వారంతా తాగుతున్నారు. ఈ పరిస్థితిని ఆలోచిస్తేనే అతి భయంకరంగా ఉంది. అయితే ఈ శవం ఎవరిది? ఇలా ఎవరి పడేశారు? అన్న విషయాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్న ప్రకారం ఈ ట్యాంక్ కు సరైన మెయింటైన్ చేయకపోవడంతో ఇలా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందని అంటున్నారు.
ఈ విషయంలో జలమండలి పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇలా జరిగిన తర్వాత కూడా ఎటువంటి నీటి సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమని అంటున్నారు. ఇదే విషయాన్ని జల మండలిని అడిగినా వాటర్ ట్యాంకర్లు అందుబాటులో లేవని కుంటి సాకు చెబుతున్నారని వాపోతున్నారు అక్కడి వాసులు.  ఈ వాటర్ తాగిన స్థానికులు ఆయాసం, గొంతులో ఇబ్బంది మరియు ఇతరత్రా సమస్యలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనితో అక్కడి ఉన్న వారు భయకంపితులు అవుతున్నారు. అయితే ఈ శవం పడిన నీరు తాగడం వలన ఏమైనా రోగాలు వచ్చాయా అన్నది తెలుసుకోవడానికి ఎటువంటి హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: