ఉద్యమంపై గేరు మార్చేసిన విశాఖ ఉక్కు కార్మికులు....!

Podili Ravindranath
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాగర తీరం మారుమోగుతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను వంద శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం ప్రకటించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్టీల్ సిటీ కార్మికులు... ఆందోళన బాట పట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఇవి ఇప్పటికే 300 రోజుల మైలురాయికి చేరుకుంది. దీంతో స్టీల్ సిటీ కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరి నెల 27వ తేదీన కేంద్రం ప్రకటించింది. నాటి నుంచి నేటి వరకు కూడా కార్మికులతో పాటు విశాఖ ప్రాంత వాసులు కూడా ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నాటి నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు కార్మీకులు. జిల్లాల వారీగా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు సమావేశాలు నిర్వహించారు. అన్ని వర్గాల వారి అభిప్రాయాలు సేకరించారు. తమ ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు కూడా కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు.
తమ ఆందోళనలు 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా... స్టీల్ ప్లాంట్ బయట భారీ ధర్నా నిర్వహిస్తున్నారు స్టీల్ సిటీ కార్మికులు. గాజువాక సమీపంలో భారీ ధర్నా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తమ డిమాండ్‌ను కేంద్రానికి వినిపించాలనేది కార్మికులు భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఇప్పటికే కార్మికులు తేల్చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు భారతీయ జనతా పార్టీ మినహా... అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మద్దతును ఇప్పటికే ప్రకటించాయి. స్టీల్ ప్లాంట్ కోసం నిర్వహించిన బంద్, రాస్తారోకో, వంటా వార్పు వంటి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఒక అసెంబ్లీలో తీర్మాన కూడా చేసి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ స్టీల్ సిటీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కీ తీసుకోవాలని కూడా అన్ని పార్టీల నేతలు ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో కూడా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: