ఏపీ రాజకీయాల్లో ఏక్ నిరంజన్ ?

RATNA KISHORE
ఎప్పటికి ఏది ప్రస్తుతమో అదే మాట్లాడాలి
ఏది నొప్పించదో ఆ మాట మాత్రమే పైకి అనగలగాలి
పైకి చెప్పినవన్నీ లోపల విషయాలతో సంబంధం ఉంచుకుని
పలకగలగాలి.. ఒప్పును తప్పును అర్థం చేసుకుని
జీవిత కాలం అవసరం అయ్యే రాజకీయం మాత్రమే చేయాలి చేయగలగాలి కూడా!  


చంద్రబాబుకు నమ్మిన బంటు కాస్త జగన్ కు నమ్మని బంటుగా మారిపోయి చాలా కాలం అయినప్పటికీ వంశీ తీరు పై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అసెంబ్లీలో వైసీపీ తరఫున గొంతు వినిపించినా అదేదీ ఆ పార్టీకి ప్లస్ కాలేదని తేలిపోయింది. దీంతో వంశీని దూరం చేసి పార్టీకి అనుగుణంగా పనిచేసే వారిని ఎంకరేజ్ చేయాలని జగన్ ప్లాన్. ఇక చంద్రబాబును తిట్టించింది చాలు ఇకపై పార్టీ  నిర్మాణం లేదా పునర్ నిర్మాణంపై దృష్టి సారిద్దాం అన్న భావంలో ఉన్నారు జగన్ .. సో ఇకపై వంశీకి కానీ నానీకి కానీ జగన్ నుంచి ప్రోత్సాహం దక్కదు గాక దక్కదు.


రాజకీయాల్లో శాశ్వతత్వం అంటూ ఏమీ ఉండదు. రాజకీయం ఎలా ఉన్నా మంచో చెడో ఏదో ఒకటి నమోదు అవుతూనే ఉంటుంది. కొన్ని సార్లు మంచి జరిగితే చంద్రబాబు లాంటి నాయకులు తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారని వైసీపీ అంటూ ఉంటుంది. అయినా మంచిని ఎవరు మాత్రం తమ ఖాతాలో వేసుకోరు. మంచిని మాత్రమే తమ వద్ద ఉంచుకుని చెడును వద్దనుకోవడం కూడా ఓ విధంగా మంచికి సంకేతమే! కానీ రాజకీయాల్లో పరిణామాల్లో వచ్చే మార్పులను చెడు మంచి అన్నవాటికి అతీతంగా చూడరు. అందుకే చంద్రబాబు కానీ జగన్ కానీ మంచి అంతా తమదే అని భ్రమించడంలో తప్పే లేదు. ఆ విధంగా వారిని చుట్టూ ఉన్నవారు ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏక్ నిరంజన్ ఎవ్వరో చూద్దాం.


టీడీపీలో మంచి లీడర్.. ఆ ఇంటి మనిషి ఓ విధంగా! కానీ ఇప్పుడు వంశీ పార్టీ మారారు. రూటు మార్చారు. దీంతో వంశీ స్థాయి మారిపోతుందని అంతా అనుకున్నారు. వంశీ స్థాయి మారిందో లేదో కానీ అప్పటికన్నా మెరుగయిన స్థాయి మాత్రం ఇది కాదు. ఆయన మాట్లాడిన మాటలు లేదా ఆయన అదుపు కోల్పోయి చేసిన వ్యాఖ్యలు కారణంగానే ఇవాళ వైసీపీ కూడా వంశీని వద్దనుకుంటోంది. ఒకప్పుడు వంశీని అడ్డం పెట్టుకుని ఎంతో డ్రామా నడిపిన వైసీపీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తిగా పంథా మార్చుకుంది. ఆయననే కాదు ఆయన వర్గాన్ని కూడా దూరం ఉంచాలని అదే పార్టీకి శ్రేయొస్సు అని భావిస్తోంది. ఓ విధంగా ఏక్ నిరంజన్ అన్న విధంగా ఆయన అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: