దేశ రాజ‌కీయాల‌కు ఎంపీ రామూ గుడ్ బై ?

RATNA KISHORE
ఢిల్లీ రాజ‌కీయాల‌ను శాసించిన నేత ఎర్ర‌న్నాయుడు. ఢిల్లీ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసిన నేత రామ్మోహ‌న్ నాయుడు. చిన్న కుర్రాడు. అతి చిన్న వ‌య‌సులోనే పార్లమెంటేరియ‌న్ గా మంచి ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించిన వాడు. తానేంటో నిరూపించుకున్న వాడు రామ్మోహ‌న్ నాయుడు. కింజ‌రాపు వారింటి వంశాంకురం. బాగా చ‌దువున్న వాడు. మంచి సంస్కారి. ఏం చెప్పినా బుద్ధిగా వింటాడు. త‌న ప‌ని తాను చేసుకుంటూ ప్ర‌భుత్వం తీరులో వ‌చ్చే ప్ర‌తి ఇబ్బందినీ ప్ర‌శ్నిస్తాడు. ఓ విధంగా ఇవాళ టీడీపీకి కావాల్సిన గొప్ప నేత అనేందుకు కావాల్సిన ల‌క్ష‌ణాలు ఉన్న‌వాడు రాము.
అన్నీ బాగుంటే న్యూయార్క్ వీధుల‌లో హాయిగా ఉండేవాడు. తండ్రి మ‌ర‌ణంతో ఆక‌స్మికంగా ఇటుగా వ‌చ్చిన మంచి ప‌ట్టు పెంచుకుని నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురులేని నేత అయ్యాడు. ఓ సంద‌ర్భంలో వైసీపీ నేత బొత్స సైతం ఆయ‌న‌ను ఎంత‌గానో ప్ర‌శంసించారు. అంతేనా క‌విత‌క్క (టీఆర్ఎస్ నేత‌) కూడా ఆయ‌న‌ను ఎంత‌గానో ప్ర‌శంసించారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు అన్ని పార్టీల నేత‌లూ ఆయ‌న అభిమానులే! వెంక‌య్య ఆయ‌నను చూసి మురిసిపోతారు. వెల్డ‌న్ మై బోయ్ అని అంటారు మోడీ.. ప్ర‌భుత్వ విధానాలు విమ‌ర్శించినా కూడా ఆయ‌న మాట్లాడే తీరును చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌న ప్ర‌ధాని వంతు. మ‌రెందుకు ఇటుగా వ‌స్తున్నారు. ఎందుక‌ని  ఢిల్లీ రాజ‌కీయాల‌ను వ‌దిలేయాల‌ని అనుకుంటున్నార‌ని?
ఎందుకంటే ఎప్ప‌టి నుంచో ఆయ‌న జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయాల‌నుకుంటున్నారు క‌నుక.. ఢిల్లీ రాజ‌కీయాల్లో ఉంటూ తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు క‌నుక.. జిల్లా పార్టీలో కూడా త‌న‌కంటూ ఓ గుర్తింపు ఉంది క‌నుక దానిని కొనసాగిస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఇవ‌న్నీ రామూ దృష్టిలో ఉన్న విష‌యాలు..అంతేకాదు ఢిల్లీ రాజ‌కీయాల్లో తానొక్క‌డే మాట్లాడుతూ మంచి పేరే తెచ్చుకున్నా అవ‌న్నీ తాత్కాలిక‌మే! అందుకే ముందున్న కాలంలో కుటుంబ బాధ్య‌త‌ల నేప‌థ్యంలో ఇటుగా వ‌చ్చేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. త్వ‌ర‌లో రానున్న ఎన్నిక‌ల్లో న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ఎంఎల్ఏగా పోటీచేయ‌నున్నారు. త‌న సొంత సామాజిక వ‌ర్గ నేత, బంధువు అయిన కృష్ణ దాస్ ను ఢీ కొన‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: