మధుసూదన్‌కు పాజిటివ్ తక్కువేనా?

M N Amaleswara rao
గత ఎన్నికల్లో జగన్ గాలిలో చాలా టీడీపీ కంచుకోటలు బద్దలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాళహస్తిలో సైతం వైసీపీ జెండా ఎగిరింది. కాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి పట్టు ఉంది. అక్కడ ఆయనే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. మధ్యలో ఆరోగ్యం బాగోక పోవడంతో మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇక 2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీకి దూరమయ్యారు. దీంతో కాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి టీడీపీ తరుపున బరిలో దిగారు. అటు వైసీపీ తరుపున 2014లో బొజ్జలపై పోటీ చేసి ఓడిపోయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి మళ్ళీ పోటీ చేశారు. కానీ 2019 జగన్ గాలి, టీడీపీపై వ్యతిరేక ఉండటంతో బియ్యపు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బియ్యపు...రెండున్నర ఏళ్లలో అనుకున్న మేర సత్తా చాటలేదని తెలుస్తోంది. ఎక్కడకక్కడే ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలే తప్ప కాళహస్తిలో కొత్తగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదు. పైగా బియ్యపు ఎక్కువ హడావిడి చేస్తూ వివాదాల్లో మాత్రం ఎక్కువ ఉంటున్నారు. ప్రజా సమస్యలు కంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని తిట్టడంలో, జగన్‌కు భజన చేయడంలోనే మధుసూదన్ ముందు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు అసెంబ్లీలో ఈయన భజన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాగే చంద్రబాబుని ఎలా ఎగతాళి చేస్తారో తెలిసిందే.
ఈ పరిణమాల నేపథ్యంలో కాళహస్తిలో మధుసూదన్‌కు పాజిటివ్ ఎక్కువ రాలేదు. అటు ఏమో టీడీపీ నేత సుధీర్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. అయితే రెండున్నర ఏళ్లలో ఆయన ఎక్కువ పుంజుకోలేకపోయారు. అదే మధుసూదన్‌కు ప్లస్ అవుతుంది. ఇక వచ్చే రెండున్నర ఏళ్లలో  గానీ సుధీర్ పుంజుకుంటే...మధుసూదన్‌కు నెక్స్ట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈజీగా గెలవాలంటే మధుసూదన్ ఇంకా పాజిటివ్ పెంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: