ఈ మాజీ మంత్రుల‌ను బ‌క‌రాల‌ను చేసిన జ‌గ‌న్ ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది శాసనమండలిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి వల్ల ప్రతి ఏడాది రు. 60 కోట్ల అదనపు భారం పడుతుందని దీని వల్ల ఉపయోగం లేదని భావించిన జగన్ మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లోనే శాసనమండలి సభ్యులుగా ఉండి జగన్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ ల‌ను రాజ్యసభకు పంపి ఎమ్మెల్సీలు గా రాజీనామా చేయించారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఓడిపోయారు.
అయితే జగన్ తన మంత్రి వర్గంలోకి తీసుకుని కీలక శాఖలు అప్పగించారు. అయితే మూడు రాజధానులు బిల్లు శాసనమండలిలో వీగిపోవడంతో జగన్ పెద్దల సభ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శాసన మండలి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడు మండలి నుంచి మంత్రులుగా ఉన్నా మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ లను క్యాబినెట్ నుంచి తప్పించి... వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు.
అయితే ఇప్పుడు శాసన మండలి రద్దు బిల్లును జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. శాసనమండలిని కొనసాగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు ఇటీవ‌ల కొత్త‌గా మ‌రో 14 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి ఎంపిక‌య్యారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్న మోపిదేవి ర‌మ‌ణ‌, పిల్లి బోస్ ల‌కు మాత్రం తీర‌ని అన్యాయం జ‌రిగింద‌న్న చ‌ర్చ‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.
జ‌గ‌న్ తొల‌గించిన ఆ ఇద్ద‌రు మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే పిల్లి, మోపిదేవిలకు అన్యాయం జరిగింద‌నే చ‌ర్చ ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు వారు మంచి ప‌ద‌వుల్లో ఉన్నా కూడా మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన‌ట్టు అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: