పదివేల కోట్లతో ఫిల్మ్ సిటీ... ఎక్కడో తెలుసా ?

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైఇఐడిఎ) త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ విమానాశ్రయానికి సమీపంలో 1,000 ఎకరాల ఫిల్మ్ సిటీ నిర్మాణానికి బిడ్‌లను ఆహ్వానించనుంది. ఈ ప్రాజెక్టు కోసం 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. బిడ్ ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేస్తూ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సిబిఆర్ ఇ  రూపొందించిన ముసాయిదాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం   ఆమోదించింది.
సోమవారం బిడ్ జారీ చేస్తామని, డిసెంబర్ 8న ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తామని అథారిటీ సీఈవో అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. "ఇది పబ్లిక్-ప్రైవేట్" భాగస్వామ్య నమూనాలో అమలు  చేస్తామని  అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని, మొదటి దశను 230 ఎకరాల్లో అభివృద్ధి చేసి 2024 నాటికి పూర్తి చేయాలని  సిబిఆర్ ఇ   ప్రతిపాదించింది. జెవార్ విమానాశ్రయానికి 4 కిమీ దూరంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సెక్టార్ 21 వద్ద ప్రతిపాదిత భూమి ఉంది. దీనికి ఎలాంటి కనెక్టివిటీ సమస్య లేదు,   మేము జెవార్ విమానాశ్రయాన్ని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తోనూ, బుల్లెట్ రైలుతోను కలుపుతున్నాము," అని అరుణ్ వీర్ సింగ్ చెప్పారు. జేవార్  విమానాశ్రయం  నుంచి  ఫిల్మ్ సిటీని కనెక్ట్  చేస్తారు. 2028-29 నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సిబిఆర్ ఇ పేర్కొంది.
సినిమా బిజినెస్ వాల్యూ చైన్ కోసం ఇంటిగ్రేటెడ్ మీడియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించడం ప్రాజెక్ట్  ముఖ్య ఉద్దేశ్యం, లక్ష్యం కూడా అదే.
రాయితీ వ్యవధి 40 సంవత్సరాలు, ఇది మరో 30 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన కంపెనీ వార్షిక ప్రీమియం కానీ, రెవెన్యూ వాటా కానీ ఏది ఎక్కువైతే అది ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతిపాదిత 1,000 ఎకరాల స్థలంలో చిత్రీకరణ కోసం 740 ఎకరాలు, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం 40 ఎకరాలు, వినోద ఉద్యానవనం మరియు రిటైల్ పార్కుల కోసం 120 ఎకరాలు, మిగిలిన 100 ఎకరాలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించనున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్   సినీ వర్గాలకు ఓపెన్ ఆఫర్‌ కూడా ఇచ్చారు.  ఓటిటి , మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ట్రెండ్  ప్రభుత్వానికి బాగా తెలుసునని ఆయన చెప్పారు.  అన్ని ప్రీ-ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ ల్యాబ్‌లు,  అంతర్జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీతో పాటు,  అధిక సామర్థ్యం గల డేటా సెంటర్‌ను ప్లాన్ చేసినట్లు  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: