ఆ యుద్ధం తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి : రాజ్ నాథ్ సింగ్

అగ్ర రాజ్యం చైనా, భారత దేశం మధ్య... ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దులో గత కొంత కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం యావత్ భారతావనికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో  పరిస్థితులు  ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎం వినాల్సి వస్తుందోనన్నంత టెన్షన్ ను కలిగిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో  భారత ప్రభుత్వం తూర్పు లద్దాఖ్ లో సైనిక స్మారకాన్ని నిర్మించింది. దానిని  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.
రేజాంగ్ లా ప్రాంతం.  ఇది తూర్పు లద్దాఖ్ లో ఉంది. ఈ ప్రాంతానికి  ఓ ప్రత్యేకత ఉంది. 1962 లో సరిహద్దు దేశం చైనా భారత్ పై సైనిక దాడి చేసింది. దీనిని భారత జవాన్లు తిప్పికొట్టారు. ఆ చారిత్రాక పోరులో భారత్ విజయం సాధించింది. చైనా తోక ముడి పారిపోయింది. సముద్ర మట్టానికి దాదాపు పద్దనిమిది వేల అడుగుల ఎత్తులో అక్కడ యుద్ద స్మారకాన్ని సైనికులు నిర్మించారు. ఈ స్మారకాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.  నాటి యుద్ధం లో పాల్గోన్న విశ్రాంత బ్రిగేడియర్ వి.ఝాటర్ ను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని స్మారక చిహ్నం వద్దకు రాజ్ నాథ్ స్వయంగా తోడ్కోని వచ్చారు. అమర వీరులకు నివాళులర్పించారు. అక్కడి సైనికులతో సంబాషించారు. రెజాంగ్ లా ప్రాంతంలో  జరిగిన చారిత్రాత్మక యుద్ద తలుకున్నప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన సైన్యం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించింది వారి పరాక్రమాలు  భారత యుద్ధ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిదని  నేను గర్వపడేలా చెబుతున్నాను. నాకా కాదు ప్రతి భారతీయ్యుడి లోనూ ఈ యద్దం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని రాజ్ నాథ్ సింగ్ పేర్కోన్నారు. అంతే కాకుండా బ్రిగేడియర్ వి. ఝాటర్ ధైర్యానికి నా సెల్యూట్. ఆయన చారిత్రాత్మక యుద్ధ సమయంలో కామాండర్ గా పని చేశారు. ఆయనను దగ్గరగా చూసే అదృష్టం నాకు ఇవాళ కలిగింది. అనిరక్షణ మంత్రి పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: