జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

Gullapally Rajesh
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అఖిల భారత సర్వీసు లో పనిచేసే ఉద్యోగులు అధికార పార్టీల వైపు చూడటం ఆసక్తికరంగా మారిన అంశం. గతంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏ విధంగా అయితే రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యే వారో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని కొంత మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సీఎం కేసీఆర్ మీద నమ్మకంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకట రామి రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మాజీ కలెక్టర్ అధికార పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండవచ్చని ఇప్పటికే నేరుగా సీఎం జగన్ తో మాట్లాడారు అని అంటున్నారు. ఆయనను ఒక నియోజకవర్గానికి సీఎం జగన్ కేటాయించే అవకాశం ఉందని మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం ఆయనకు సలహాదారు పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిపాలనా వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్న సదరు అధికారి కి జగన్ కీలక బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు.
ఆర్థిక శాఖలో కీలక పాత్ర పోషించిన సదరు అధికారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా సానుకూలంగా  కూడా ఉన్నారని అభిప్రాయం కూడా ఉంది. ఇటీవలి కాలంలో కొంతమంది కీలక అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి దేశవ్యాప్తంగా అధికార పార్టీలో జాయిన్ కావడం అనేది జరుగుతూ వస్తోంది. బీహార్ లో కూడా కొంత మంది ఐపీఎస్ ఉద్యోగుల త్వరలోనే నితీష్ కుమార్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ లో కూడా కొంత మంది ఐఏఎస్ అధికారులు యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో బిజెపిలో జాయిన్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: