బ్రేకింగ్: ఢిల్లీలో మళ్ళీ లాక్ డౌన్, అయితే కారణం కరోనా కాదు...?

Gullapally Rajesh
దేశ వ్యాప్తంగా ఇప్పుడు కాలుష్యం విషయంలో ఆందోళన క్రమంగా పెరుగుతూ వస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎక్కువ కాలుష్యం పెరుగుతున్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ కూడా ముందు వరుసలో ఉంది. అక్కడ చలికాలం వస్తే వాతావరణ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది  అనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఇక ఢిల్లీలో కాలుష్యం పెరుగుదల ప్రభావంపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు.
ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్యం  పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇంట్లో కూడా మాస్క్ లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేసింది కోర్ట్. కాలుష్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన సమయం ఇది అని తెలిపింది. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. అవసరమైతే లాక్‌డౌన్ కూడా విధించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాలుష్యానికి చుట్టు పక్కల రాష్ట్రాల రైతులు కూడా బాధ్యులని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వాహనాలు, పరిశ్రమలు, దుమ్ము తదితర వాటి వల్ల కాలుష్యం తీవ్రంగా వ్యాపిస్తుంది అని పేర్కొంది.
కాలుష్యానికి గడ్డి తగులబెట్టడం.. మాత్రం ఒక కారణమని, బాణసంచా నిషేధం అమలుకు బ్యాన్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఏమయ్యాయని సుప్రీం కోర్ట్ నిలదీసింది. తక్షణమే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది అని కాలుష్యానికి సంబంధించి రాష్ట్రాలు రాజకీయాలు చేయరాదని సుప్రీం కోర్ట్ సూచించింది. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కొన్ని రోజులుగా వ్యవసాయ వ్యర్థాలు దగ్ధం చేయడాన్ని ఎందుకు ఆపడం లేదని నిలదీసింది. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలు తెరవడంతో.. పిల్లలు బడికి వెళ్లాల్సి వస్తోందని, అలాంటి పరిస్థితుల్లో వారి ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉందని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.
దీనిపై ఢిల్లీ ప్రభుత్వం పునరాలోచన ఆలోచించాలన్న సుప్రీంకోర్టు... ఢిల్లీ ప్రభుత్వం స్మోగ్ టవర్లను ఏర్పాటు చేసింది.. వాటికి ఏమైందని నిలదీసింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీం కోర్ట్ సూచించింది. కేంద్ర ప్రభుత్వం సహా కాలుష్య సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాలని... ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చించాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: