ప‌వ‌న్ ప్ర‌త్య‌ర్థి ఇక ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌డా...!

VUYYURU SUBHASH
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఇక ఎమ్మెల్యే గా కూడా గెలిచే ప‌రిస్థితి లేదా ? ఆయ‌న పొలిటిక‌ల్ సీన్ సితార అయిపోయిందా ? అంటు అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పార్టీ పెట్టి తొలి సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. జ‌న‌సేన ఏపీలో పోటీ చేయ‌డంతో పాటు పార్టీ అధ్య‌క్షుడి హోదాలో ప‌వ‌న్ సైతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంతో పాటు విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు చోట్లా కాపుల ఓట్లు ఎక్కువుగా ఉంటాయ‌నే ప‌వ‌న్ పోటీ చేశారు. అయితే ప‌వ‌న్ రెండు చోట్లా కూడా చిత్తు గా ఓడిపోయారు.
ప‌వ‌న్ పై గాజువాక‌లో తిప్ప‌ల నాగిరెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు. అయితే ఆయ‌న గ‌తంలో రెండు సార్లు ఓడిపోయి మొన్న తొలిసారి సానుభూతితో పాటు జ‌గ‌న్ వేవ్ లో ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఆయ‌న‌కు గెలిచే సీన్ లేద‌ని గాజువాక జ‌నాలే చెపుతున్నారు. నాగిరెడ్డి 2009 లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసి.. రెండు సార్లు కూడా ఓడిపోయారు.
అయితే గ‌త ఎన్నిక‌ల్లో సానుభూతికి తోడు .. జ‌గ‌న్ వేవ్ కూడా క‌లిసి రావ‌డంతో ఎట్ట‌కేల‌కు నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ ఆనందం రెండేళ్ల‌కే ఆవిరయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ క‌ర‌ణ దెబ్బ నాగిరెడ్డికి మామూలుగా లేద‌నే చెప్పాలి. ఇక్క‌డ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువుగా ఉన్నారు. దీనికి తోడు ఆయ‌న ఇద్ద‌రు కుమారుల కు కూడా ప‌ద‌వులు ఇప్పించుకున్నారు. కుటుంబం పెత్త‌నంతో పాటు ఆయ‌న ఎమ్మెల్యే గా చేసిందేమి లేద‌న్న టాక్ వ‌చ్చేసింది. అందుకే ఇక ప‌వ‌న్ ప్ర‌త్య‌ర్థి ఈ సారి ఎమ్మెల్యే గా కూడా గెల‌వ‌డ‌నే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: