పవన్ ప్రత్యర్ధితో పాటు ఆ ముగ్గురుకు నెక్స్ట్ టఫ్ఫే..?

M N Amaleswara rao
గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ నేతలకు గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. గత ఎన్నికల్లో అంటే జగన్ గాలి ఉంది....అలాగే చంద్రబాబుపై వ్యతిరేకత ఉంది. ఈ పరిస్తితుల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చేసింది...అసలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఎవరనేది ప్రజలకు సరిగా క్లారిటీ లేకపోయినా సరే వైసీపీ నుంచి గెలిచేశారు. కానీ ఈ సారి మాత్రం అలా గెలవడం కష్టమే అని తెలుస్తోంది. జగన్ ఇమేజ్ ఉన్నా సరే..సొంత ఇమేజ్ పెంచుకోకుండా, సరైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు ఈ సారి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది.
ముఖ్యంగా విశాఖపట్నంలో కొందరు ఎమ్మెల్యేలు బోల్తా కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది...అదే సమయంలో టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు..ఇక జనసేన గానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే విశాఖలో చాలామంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడేలా ఉన్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ ప్రత్యర్ధి అయిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి...గత ఎన్నికల్లో నాగిరెడ్డి, పవన్‌పై గెలిచిన విషయం తెలిసిందే.
పవన్‌ని ఓడించి సంచలనం సృష్టించిన నాగిరెడ్డి గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదని తెలుస్తోంది. ఈ రెండున్నర ఏళ్లలో ఆయన పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు కూడా కనిపించడం లేదు. నాగిరెడ్డితో పాటు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ సైతం కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన కూడా ఎఫెక్టివ్‌గా పనిచేసే విషయంలో విఫలమైనట్లే కనిపిస్తోంది.
అటు పెందుర్తిలో అదీప్ రాజ్ సైతం ఎమ్మెల్యేగా వెనుకపడినట్లే తెలుస్తోంది. ఇటు పాడేరులో భాగ్యలక్ష్మికి కూడా అంత అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే...ఈ నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచివారే. తొలిసారి మంచి అవకాశం వచ్చినా సరే..వీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి నాగిరెడ్డి, అదీప్, ఉమా శంకర్, భాగ్యలక్ష్మీలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: