అబ్బాయిల‌కు స్క‌ర్టులు వేసుకుంటే లింగ‌బేధం పోతుందా..?

Paloji Vinay
ప్ర‌పంచంలోని ఒక్కో దేశంలో ఒక్కో సాంప్ర‌దాయాలు, నిబంధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇందులో లింగబేధం కూడా అనాదిగా వ‌స్తోంది. దీంట్లో అమ్మాయిలు ఒక‌ర‌కంగా దుస్తులు ధ‌రించాలని, అబ్బాయిలకు కూడా సెప‌రేట్ డ్రెస్ కోడ్ ఉంది. ఇది ముఖ్యంగా పాఠ‌శాల‌లు, కాలేజీల్లో ఇత‌ర ఇన్‌స్టీట్యూట్ అయినా అదే పాటించాలి. కానీ, ఓ దేశంలో మాత్రం అబ్బాయిలందరూ, అమ్మాయిలు వేసుకొనే స్కర్టులు వేసుకొని పాఠ‌శాల‌కు వ‌చ్చిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే, అబ్బాయిలు స్క‌ర్ట్ వేసుకోవ‌డం వెనుక ఒక కార‌ణం ఉంద‌ని తెలుస్తోంది. పోయిన ఏడాది స్పెయిన్ లో ఓ విద్యార్థి అమ్మాయిలు వేసుకునే స్కర్టు ధ‌రించి పాఠ‌శాల‌కు రావ‌డంతో స్కూల్  యాజమాన్యం ఆ విద్యార్థిని ఎగ‌తాలి చేసి క్లాస్ రూమ్ నుంచి పంపించేశారు. ఈ విష‌యంపై అప్ప‌ట్లో క‌థ‌నా లు కూడా వెలువ‌డ్డాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థికి అండగా స్కర్ట్ ఉద్యమమే మొదలు పెట్టార‌ట‌.. దీనికి మ‌ద్ధ‌తుగా వారి త‌ల్లిదండ్రులు కూడా ఉద్య‌మంలో పాల్గొన్నారు.


  తాజాగా, మెక్సికో నగరంలో ఉన్న స్కూళ్లకు ఇకపై అబ్బాయిలు కూడా స్కర్ట్‌లు వేసుకుని వెళ్లచ్చని న‌గ‌ర మేయ‌ర్ క్లాడియా షేన్ బామ్ ఆదేశాలు జారీ చేశారు.  లింగ‌వివ‌క్ష‌ను తొల‌గించ‌డానికి ఈ ప‌ద్ధ‌తిని పాటిస్తుమ‌న్నాని చెబుతున్నారు. ఈ నిర్ణ‌యానికి ట్రాన్స్‌జెండ‌ర్ సంఘాలు కూడా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే, దీనిపై అనేక భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. లింగ వివ‌క్ష తొల‌గించాలంటే కేవ‌లం ధుస్తులు వేసుకుంటే స‌రిపోద‌ని ప్ర‌జ‌ల మెద‌డుల్లో ఆలోచ‌న రావాలంటున్నారు.


అబ్బాయిలు అమ్మాయిలే దుస్తులు, అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సులు వేసుకుంటే లింగ‌స‌మాన‌త్వం రాద‌ని తెలియ‌దా అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతున్నాయి. బ్రిట‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్న‌డో అభివృద్ధి చెందాం.. ప్ర‌పంచానికి అన్ని నేర్పించామ‌ని చెబుతున్న బ్రిట‌న్ ఇలాంటి త‌లా తోక లేని నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: