జగన్ పాదయాత్ర : రెండు నెలలు.. రాయలసీమలోనే..!

Chandrasekhar Reddy
జగన్ మోహన్ రెడ్డి తండ్రి బాటలో ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు స్వయంగా తెలుసుకోవాలని సంకల్పించడంతో ప్రజాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. దాదాపు రెండేళ్లు సాగిన ఈ యాత్ర మొదట కేవలం ఆరు నెలలు మాత్రమే అనుకున్నారు. ఇడుపులపాయలో ఆయా పవిత్ర స్థలాలను దర్శించి అనంతరం వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడంతో ఈ యాత్ర ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి దాదాపుగా రెండు నెలలపైనే కేవలం రాయలసీమలో ఈ యాత్ర సాగింది. ప్రారంభం రోజునుండి దాదాపు రోజు ఏడు కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో ప్రధానంగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు స్వయంగా తెలుసుకోవడం, అవసరం అనుకున్న చోట సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆలాగే ఆయా వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం లాంటివి చేశారు.
రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది. కడప లో ఏడు రోజుల పాటు 93.8 కిమీ ల మేర యాత్ర సాగింది. ఇందులో ఐదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. మూడు ఆత్మీయసమ్మేళనాలు, ఆయా వర్గాలతో భేటీలు కావడం ద్వారా మొత్తం ఐదు నియోజక వర్గాలలో యాత్ర చేశారు. యాత్ర లో అనంతరం కర్నూలు లో ప్రవేశించారు. ఇక్కడ కూడా 18 రోజులపాటు యాత్ర కొనసాగింది. అందులో దాదాపుగా 263 కిమీ మేర జగన్ పాదయాత్ర చేశారు. ఇక్కడ జగన్ ఏడు నియోజక వర్గాలలో పర్యటించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ఎనిమిది బహిరంగ సభలు, 6 ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించారు. యాత్ర 26వ రోజున అనంతపురంలో ప్రవేశించడం జరిగింది. ఇక్కడ కూడా జగన్ 9 నియోజక వర్గాలలో పర్యటించారు. అందుకు ఆయన 280 కిమీ నడిచారు. అనంతపురంలో కూడా పది బహిరంగ సమావేశాలు, 4 ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు జగన్.
యాత్రలో 46వ రోజున జగన్ చిత్తూరు జిల్లాలో ప్రవేశించారు. ఈ జిల్లాలో కూడా ఆయన 23 రోజులు  పాదయాత్ర చేస్తూ, పది నియోజక వర్గాలు పర్యటించారు. దీనికి ఆయన 291.4 కిమీ నడిచారు. ఇక్కడ కూడా ఆయన 8 బహిరంగ సమావేశాలు, 9 ముఖాముఖీ సమావేశాలు నిర్వహించారు. ఇలా దాదాపుగా రెండు నెలలు రాయలసీమ లోనే జగన్ పర్యటించారు. ఆద్యంతం ప్రజాదరణతో ఈ యాత్ర జగన్ కు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతో యాత్ర కొనసాగించారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: