యాత్ర‌కు నాలుగేళ్లు : తండ్రి బాట‌లో త‌న‌యుడు..!

Paloji Vinay
తండ్రి ఆశ‌య సాధ‌న‌కు న‌డుం బిగించిన త‌న‌యుడు.. ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డిన మ‌హానేత బాట‌లో న‌డిచిన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి. తన తండ్రి మ‌ర‌ణానంత‌రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట పార్టీ పెట్టిన జ‌గ‌న్ త‌న తండ్రి ఆశ‌యాల‌ను పూర్తి చేయాల‌ని నిర్ణయించుకున్నాడు. 2011 లో పార్టీ స్థాపించిన జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సువార్ణాంధ్ర‌ప్రదేశ్ గా మార్చాల‌నుకున్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌ల‌ను త‌న బుజాల‌మీద ఎత్తుకున్నాడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

  తెలుగు రాష్ట్రాల్లో పాద‌యాత్ర‌తో అధికారంలోకి వ‌చ్చిన నేత‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్ నిలుస్తే. ఆయ‌న త‌రువాత అదే బాట‌లో న‌డిచిన ఆ దివంగ‌త నేత‌న కొడుకు వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కూడా పాద‌యాత్ర‌తో అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడు. వైఎస్ వార‌సుడిగా అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటిని నెర‌వేర్చేందుకు కృషి చేస్తున్నాడు. న‌వ ర‌త్నాల పేరుతో తెచ్చిన ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పై భ‌రోసా క‌లిగింద‌ని చెప్పాలి.


అధికారంలోకి రావ‌డానికి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన పాద‌యాత్ర దేశంలో రికార్డు గా నిలిచింది.  2017 న‌వంబ‌ర్ 6న ఇడుపుల పాయ‌లోని దివంగ‌త నేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌మాధి వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. పాద‌యాత్ర పూర్తి చేసుకుని నేటి నాలుగేళ్లు గ‌డుస్తోంది.


  2017 న‌వంబ‌ర్ 6న ప్రారంభ‌మ‌యిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2019 జ‌న‌వ‌రి 9వ తేదిన ఇచ్చాపురంలో ముగిసింది. 341 రోజుల పాటు సాగిన ఈ పాద‌యాత్ర‌లో 134వ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 231 మండ‌లాలు, 2,516 గ్రామాల మీదుగా ప్ర‌జాసంక‌ల్ప యాత్ర త‌న తండ్రిని గుర్తు చేశారు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. అధికారం చేనట్టిన అనంత‌రం సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తూ వైఎస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: